ప్రేక్షకులు నిరాశ చెందరు  | Naga Vamsi Speech at Funky Movie Success Meet | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు నిరాశ చెందరు 

Feb 14 2026 5:51 AM | Updated on Feb 14 2026 5:51 AM

Naga Vamsi Speech at Funky Movie Success Meet

– నాగవంశీ

విశ్వక్‌ సేన్  , కయాదు లోహర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఫంకీ’. కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ సక్సెస్‌మీట్‌లో విశ్వక్‌సేన్   మాట్లాడుతూ–‘‘సినిమా రిలీజ్‌కు ముందు ఒత్తిడితో ఉండటం సహజం. కానీ ‘ఫంకీ’ సినిమా రిలీజ్‌కు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ రోజు ఉదయం ప్రేక్షకులతో కలిసి ఈ మూవీ చూశాను.. వారు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

 ‘ఫంకీ’ నాకెంతో ఊరటనిచ్చింది’’ అన్నారు. ‘‘కుటుంబంతో కలిసి ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా, ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తీయాలనే ‘ఫంకీ’ చేశాం. ప్రేక్షకుల స్పందన సంతోషాన్నిఇస్తోంది’’ అని తెలిపారు కేవీ అనుదీప్‌. ‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. ఈ విషయంలో మేం విజయం సాధించాం. మా డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీ. నవ్వుకోవడానికి థియేటర్స్‌కు వచ్చిన వారు నిరాశ చెందరు’’ అన్నారు నాగవంశీ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు కయాదు లోహర్‌.  
 

Advertisement
 
Advertisement
Advertisement