విశ్వక్‌ సేన్‌తో సినిమా తీస్తారా?.. అర్జున్‌ ఆన్సర్‌ ఇదే! | Arjun Sarja Interesting Comments On Vishwak Sen | Sakshi
Sakshi News home page

విశ్వక్‌ సేన్‌తో సినిమా తీస్తారా?.. అర్జున్‌ ఆన్సర్‌ ఇదే!

Feb 12 2026 12:01 PM | Updated on Feb 12 2026 12:06 PM

Arjun Sarja Interesting Comments On Vishwak Sen

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో  ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా ‘సీతా పయనం’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిరంజన్‌ హీరోగా నటించిన ఈచిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా విశ్వక్‌ సేన్‌ నటించాల్సింది. పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్‌ పాల్గొన్నాడు. కానీ షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో అర్జున్‌ మీడియా ముఖంగా విశ్వక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశ్వక్‌ సైతం వివరణ ఇచ్చుకున్నాడు. చివరకు నిరంజన్‌ని హీరోగా పెట్టుకొని ఈ సినిమాకు తెరకెక్కించాడు అర్జున్‌. 

మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అర్జున్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విశ్వక్‌ వివాదంపై కూడా ఆయన స్పందించారు. విశ్వక్‌పై తనకు ఎలాంటి కోపం లేదని.. కొన్ని కారణాల వల్ల తప్పకున్నాడు. అంతమాత్రనా ఆయనపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ అవకాశం వస్తే కచ్చితంగా అతనితో సినిమా చేస్తా’ అని అర్జున్‌ అన్నారు. విశ్వక్‌ మారిన తర్వాత కథలో ఏవైనా మార్పులు చేశారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘నా సినిమాలో కథే హీరో. హీరో కోసం కథలో మార్పులు చేయలేదు. మొదట అనుకున్న కథతోనే ఈ సినిమాను తెరకెక్కించాను’ అని అర్జున్‌ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement