నా గర్భాశయాన్ని ‍తీసివేయించాడు.. ఉదిత్‌ నారాయణ్‌పై రంజనా ఫిర్యాదు | Udit Narayan First Wife Files Complaint In Bihar Against Him | Sakshi
Sakshi News home page

నా గర్భాశయాన్ని ‍తీసివేయించాడు.. ఉదిత్‌ నారాయణ్‌పై రంజనా ఫిర్యాదు

Feb 12 2026 11:51 AM | Updated on Feb 12 2026 12:20 PM

Udit Narayan First Wife Files Complaint In Bihar Against Him

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు రంజనా ఝా చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది.NDTVలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం..  బీహార్‌లోని సుపాల్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.  ఉదిత్‌ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య కలిసి తనపై క్రిమినల్ కుట్ర పన్నారని  ఫిర్యాదులో పేర్కొంది.

ఉదిత్ నారాయణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత రంజనా ఝా పలుమార్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. అయితే, తాజాగా ఆమె చేసిన ఆరోపణ అత్యంత హేయంగా ఉంది. ఆమె చేసిన  ఫిర్యాదు ప్రకారం... 1996లో హెల్త్‌ చెకప్‌ పేరుతో తనను ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పింది. అయితే, తనకు తెలియకుండా గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపించింది. తన అంగీకారం లేకుండా ఉదిత్‌ నారాయణ కుట్ర పన్నారని చెప్పింది. తాను తల్లి కాకుండా అడ్డుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 

అయితే, ఈ విషయం తనకు చాలా ఏళ్ల తర్వాత తెలిసిందని చెప్పింది.  మరో అనారోగ్య సమస్యతో డాక్టరును సంప్రదించినప్పుడు అసలు విషయం బయటపడిందని పేర్కొంది. ఉదిత్‌ నారాయణ్‌ చేసిన ఈ మోసం తనను మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో కుంగదీసిందని పోలీసుల ముందే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కుట్రలో  ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య దీప కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది.

ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే..  1985లో దీప అనే సింగర్‌ని రెండో పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. 1984న హిందూ ఆచారాల ప్రకారం తనను మొదట పెళ్లి చేసుకున్నాడని రంజనా తెరపైకి వచ్చింది. అయితే  తొలుత బుకాయించాడు గానీ ఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.

విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. కొంత కాలంగా భరణం కూడా చెల్లించడం లేదని రంజనా తెలుపుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement