ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటి ఉంది: శ్రియ | Shriya Saran Comments On Her Dream Role For Movies, Know About 25 Years Cinematic Journey | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటి ఉంది: శ్రియ

Feb 12 2026 6:38 AM | Updated on Feb 12 2026 10:32 AM

Shriya Saran Comment Her Dream role for movies

సినిమాను ప్రేమిస్తే అది కచ్చితంగా ఉన్నత స్థాయిలో కుర్చోపెడుతుంది. ఇందుకు పలువురు ఉదాహరణ. ప్రతిభ, అంతకు మించిన ప్రేమ ఉంటే సినిమా ఎవరినైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చాలా మంది నిరూపించారు. అలాంటి వారిలో నటి శ్రియ ఒకరు అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రం ద్వారా  కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హిందీ, తమిళం , కన్నడం తదితర భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు. 

తమిళంలో విజయ్, రజనీకాంత్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో , తెలుగులో చిరంజీవి, నాగార్జున వెంకటేష్‌ వంటి టాప్‌ స్టార్స్‌ తో జతకట్టి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగారు. ఎక్కువగా  గ్లామరస్‌ పాత్రల్లోనే ఈమె నటించారన్నది గమనార్హం. ఏదేమైనా గత  25 ఏళ్లుగా నాట్‌ అవుట్‌గా కొనసాగుతున్న శ్రియ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం కథానాయకి పాత్రలు కాకపోయినా నటనకు అవకాశం ఉన్న అక్క,అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో దశ్యం 3 చిత్రంలో నటిస్తున్నారు. 

కాగా నటి శ్రియ మంచి నృత్య కళాకారిణి అన్నది గమనార్హం. ఇటీవల ఈ భామ ఓ భేటీలో పేర్కొంటూ చాలా భాషల్లో చాలా చిత్రాల్లో నటించానని, అయితే తాను మొదట ప్రేమించేది నాట్యాన్ని అని చెప్పారు. ఇంత వరకు నటించని, నటించాలని ఆశపడే పాత్ర ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. తనకు నాట్య కళాకారిణి పాత్రలో నటించాలనే కోరిక చాలా ఏళ్లుగా ఉండిపోయిందన్నారు.  ఒక నాట్యకళాకారిణిగా జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే కథా చిత్రంలో  నటించాలని కోరుకుంటున్నట్లు శ్రియ పేర్కొన్నారు. తన కెరీర్‌ మొత్తంలో ఎవరూ కూడా అలాంటి పాత్ర తమ సినిమాలో ఉందని తనను కలవలేదని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భామ కోరిక నెరవేరే అవకాశం ఏ మేరకు ఉంటుందో చూడాలి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement