టాలీవుడ్ మూవీ యూఫోరియాపై ప్రిన్స్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఇది తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. గుణశేఖర్ తన కథలను ఎలా ప్రజెంట్ చేస్తారనే దానిలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని.. సినిమా బాగా నచ్చిందని మహేశ్ ట్వీట్ చేశారు. గుణశేఖర్, భూమికతో పాటు మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో భూమిక ప్రధాన పాత్రలో నటించగా.. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది.
There’s always a distinct pattern in how Gunasekhar garu presents his stories…Enjoyed the film especially the way the climax unfolds…👏🏻👏🏻👏🏻
A must watch!
Congratulations to Guna Sekhar garu, @bhumikachawlat and the entire team of #Euphoria 🤗🤗🤗@neelima_guna #YukthaGuna…— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2026


