గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ రిలీజ్
'ఒక్కడు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్.. తర్వాత కాలంలో వరుడు, సైనికుడు, నిప్పు తదితర మూవీస్ తీశారు గానీ హిట్ కొట్టలేకపోయారు. రుద్రమదేవి, శాకుంతలం లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఈయనకు కలిసి రాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'యుఫోరియా' అనే యుత్ఫుల్ మూవీ తీశారు. ఈనెలలోనే రిలీజ్ ఉండొచ్చని టాక్ వచ్చింది. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసి, విడుదల తేదీపైన క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)భూమిక, గౌతమ్ మేనన్, నాజర్, సారా అర్జున్ తదితరుల నటిస్తున్న ఈ సినిమా టీజర్ బట్టి చూస్తే.. ప్రస్తుతం యువత చెడు అలవాట్లకు బానిసై ఎలా చెడిపోతున్నారు? వీళ్ల వల్ల సమాజంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనే కాన్సెప్ట్ ఆధారంగా తీసినట్లు అనిపిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈసారైనా గుణశేఖర్కి కలిసొస్తుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్)