గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. డ్రగ్స్ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
సివిల్ సర్వెంట్ అవ్వాలనుకునే ఓ అమ్మాయిపై అత్యాచారం జరగడం.. మాదకద్రవ్యాల మత్తులో ఓ యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్లడినట్లు ట్రైలర్లో చూపించారు. ఇక భూమిక.. ఆ యువకుడిగా తల్లిగా నటించినట్లు తెలుస్తోంది. ఆమె తనపైనే కేసు వేసుకొని హైకోర్టుని ఆశ్రయించినట్లు ట్రైలర్‌లో చూపించారు. ఆమె చేసిన నేరం ఏంటి? ఫోక్సో చట్టాన్ని ఉపయోగించి ఈ అత్యాచార కేసుని పోలీసు కమిషనర్ జయదేవ్ నాయిర్(గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలా సాల్వ్ చేశాడనేది తెలియాలంటే ఫిబ్రవరి 6న సినిమా చూడాల్సిందే.


