తెలుగులో సర్‌ప్రైజ్ హిట్స్ అయిన సినిమాల్లో 'ఈ నగరానికి ఏమైంది?' ఒకటి. తరుణ్ భాస్కర్ తీసిన ఈ చిత్రం నలుగురు స్నేహితులు, వాళ్ల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తీశారు. ఇప్పటికే చాలామంది యూత్‌కి ఇది ఫేవరెట్ మూవీ. ప్రస్తుతం దీని సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇందులోని లీడ్ రోల్స్‌లో ఒకడైన సుశాంత్ తప్పుకోవడం శ్రీనాథ్ మాగంటికి అవకాశమొచ్చింది. అయితే ఈ విషయం బయటకు రాగానే తనని వెరైటీ వెరైటీ బూతులతో దారుణంగా తిట్టారని శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి)
''ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌లో నన్ను తీసుకున్నారని అనగానే.. మెసేజులు కొన్ని వచ్చాయి. అసలు ఇట్లా తిడతారేందిరా మీరు. క్యారెక్టర్లు చేసుకుంటున్నావ్ పోయి అది చేసుకో. వెరైటీ వెరైటీ బూతులతో నన్ను తిట్టారు. దీంతో ఎదుటి మనిషి అవకాశాన్ని పాలిటిక్స్ వాడి గుంజేసుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. నాకు అవకాశమొచ్చింది. ఇది నేను మీకు ఎలారా చెప్పాలి అని అనుకున్నా' అని శ్రీనాథ్ మాగంటి చెప్పుకొచ్చాడు.
మరో ఆరు రోజులు షూటింగ్ చేస్తే ఫస్టాఫ్ పూర్తయిపోతుందని చెప్పిన శ్రీనాథ్.. అసలు సెట్‌లో పనిచేస్తున్నామా పార్టీ చేసుకుంటున్నామా అర్థం కాదని కూడా అన్నాడు. అలా ఫ్లోలో వెళ్లిపోతూ ఉంటుంది బండి, అంత సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. హీరోగానే కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. హిట్, యానిమల్, లక్కీ భాస్కర్ తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన 'మెన్షన్ హౌస్ మల్లేష్' మూవీ.. ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగానే ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఈ నగరానికి ఏమైంది 2' సంగతులు చెప్పాడు.
(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా)


