రష్మిక రీల్ బ్రదర్ హీరోగా సినిమా.. ట్రైలర్ రిలీజ్
హిట్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసిన శ్రీనాథ్ మాగంటి.. 'యానిమల్' మూవీలో రష్మికకు సోదరుడిగానూ యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. అదే 'మెన్షన్ హౌస్ మల్లేష్'. మార్చి 06న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా తాజాగా సందీప్ రెడ్డి వంగా చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అలరించేలా ఉంది.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్బాస్' భామ డ్యాన్సులు)తెలంగాణలోని ఓ ఊరిలో మల్లేష్ అనే కుర్రాడు. మందు తాగుతూ అవారాగా తిరుగుతుంటాడు. మారుతాడనుకుని ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. మల్లేష్కి అతడి భార్యతో ఎలాంటి బంధం ఏర్పడింది అనేదే స్టోరీలా అనిపించింది. ట్రైలర్లోనే మూవీ ప్లాట్ ఏంటనేది దాదాపుగా బయటపెట్టేశారు. చూడాలి మరి థియేటర్లలో ఎలాంటి టాక్ అందుకుంటుందో?(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)