సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా | Mension House Mallesh Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: లేటెస్ట్ తెలుగు మూవీ.. సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్

Apr 22 2026 9:36 AM | Updated on Apr 22 2026 10:42 AM

Mension House Mallesh Movie OTT Streaming Now

మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల నటించిన 'లేచింది మహిళా లోకం' సినిమా నేడు(ఏప్రిల్ 22) ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదలా ఉండగానే మరో తెలుగు సినిమా కూడా సడన్‌గా అందుబాటులోకి వచ్చేసింది. మరో ఓటీటీలోకి వస్తుందని తాజాగా ప్రకటించారు. ఇంతలోనే ఇంకో దానిలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. చనిపోయిన ప్రముఖ దర్శక నిర్మాత)

హిట్, యానిమల్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్ మాగంటి హీరోగా చేసిన మూవీ 'మెన్షన్ హౌస్ మల్లేష్'. గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ చిత్రానికి బాల సతీష్ దర్శకుడు. మార్చి 06న థియేటర్లలో రిలీజైంది కానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.  వచ్చే వారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

'మెన్షన్ హౌస్ మల్లేష్' విషయానికొస్తే.. పల్లెటూరికి చెందిన మల్లేష్(శ్రీనాథ్ మాగంటి) చిన్నప్పటి నుంచే తాగుడికి బానిసవుతాడు. ఇతడికి తన బావ చిన్న పటేల్(రాజేష్)తో గొడవలు ఉంటాయి. ఓ సందర్భంలో తల్లి బలవంతం మీద జ్యోతి(గాయత్రి రమణ)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం రాత్రి మల్లేష్‌కి షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? దానివల్ల మల్లేష్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది మిగతా స్టోరీ. మగతనం నిరూపించుకుని భూమిని పొందాల్సిన పరిస్థితి ఓ యువకుడికి వస్తే ఏం చేసాడనే విషయాన్ని ఇందులో కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement