మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ప్రియాంక చోప్రా.. ఇది రిలీజ్ కావడానికి ముందే స్పై థ్రిల్లర్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. 'సిటాడెల్' సిరీస్ రెండో సీజన్‌పై ప్రకటన వచ్చేసింది. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)
ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు చేసిన 'సిటాడెల్' సిరీస్ తొలి సీజన్.. 2023లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఇది మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో సీజన్‌ని సిద్ధం చేశారు. మే 06వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో పాటు ఈసారి కొత్త మిషన్‌తో అలరించబోతున్నారు.
'సిటాడెల్' తొలి సీజన్ విషయానికొస్తే.. ఎఫ్‌బీఐ, రా, ఐఎస్ఐలానే సిటాడెల్ అనేది ఓ స్పై ఏజెన్సీ. ప్రపంచంలోని కొందరు వ్యక్తులు కలిసి దీన్ని ఫ్రాన్స్ వేదికగా ఏర్పాటు చేస్తారు. ఏ ఒక్క దేశానికో అని కాకుండా ప్రజలందరిని రక్షించడమే దీని లక్ష‍్యం. అయితే సిటాడెల్‌ని నాశనం చేయాలని కొందరు డబ్బునోళ్లు 'మాంటికోర్' అని మరో స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సిటాడెల్ టాప్ ఏజెంట్స్ అయిన మేసన్ కేన్(రిచర్డ్ మ్యాడెన్), నాదియా సిన్హా(ప్రియాంక చోప్రా)లని అంతం చేసేందుకు మాంటికోర్ ప్రయత్నిస్తుంది. వీళ్ల దాడి నుంచి మేనస్, నాదియా ఎలా తప్పించుకున్నారు? అనేది తొలి సీజన్.
అయితే ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటికీ హీరోయిన్ సమంతని ప్రధాన పాత్రలో పెట్టి ఈ సిరీస్ రీమేక్ చేశారు. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)


