ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా | Euphoria Movie 2026 OTT Streaming Latest Update | Sakshi
Sakshi News home page

OTT: మరో ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ.. అధికారిక ప్రకటన

Apr 21 2026 3:23 PM | Updated on Apr 21 2026 3:50 PM

Euphoria Movie 2026 OTT Streaming Latest Update

పీరియాడిక్ సినిమాలు తీస్తూ వచ్చిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రూటు మార్చి ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు తీసిన సినిమా కొన్నాళ్ల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు మరో దానిలో స్ట్రీమింగ్‌కి సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటి మూవీ? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)

ప్రస్తుతం చాలా ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న యువత డ్రగ్స్ వాడకం, మైనర్లపై అత్యాచారాలు తదితర అంశాలతో గుణశేఖర్.. 'యుఫోరియా' సినిమా తీశారు. 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ లీడ్ రోల్ చేయగా భూమిక, గౌతమ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి తొలివారంలో థియేటర్లలోకి రాగా రేపటి(ఏప్రిల్ 22) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

'యుఫోరియా' విషయానికొస్తే.. చైత్ర(సారా అర్జున్) పెద్దింటి అమ్మాయి. చదువులో టాపర్. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతుంటుంది. ఓ రోజు తన స్నేహితురాలితో కలిసి పబ్‌కి వెళ్తుంది. అక్కడ ఈమెకు వికాశ్(విఘ్నేశ్ గవిరెడ్డి), అతడి ఫ్రెండ్స్ పరిచయమవుతారు. పబ్ నుంచి తిరిగి వెళ్తున్న టైంలో వికాశ్ గ్యాంగ్.. చైత్రని తమ కారులో ఎక్కించుకుని డ్రగ్స్ మత్తులో దారుణంగా అత్యాచారం చేస్తారు. పేరు మోసిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పిల్లలు నిందితులుగా ఉన్న ఈ కేసు చివరకు ఏమైంది? చైత్రకు న్యాయం దక్కిందా లేదా అనేది మిగతా స్టోరీ.

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలని స్పూర్తిగా తీసుకుని ఈ మూవీ తీశారు. ఈ క్రమంలోనే కొడుకు.. వావివరసలు మరిచి తల్లిపైనే దారుణానికి ఒడిగట్టడం, అత్యాచార సీన్ రీ క్రియేషన్ లాంటి కొన్ని సన్నివేశాలు డిస్ట్రబింగ్‌గా అనిపించాయి. అలా ఈ చిత్రం చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement