పెద్ది ఫస్ట్‌ రివ్యూ.. అంచనాలు పెంచేసిన సమంత | Peddi Movie First Review, Netizens Talk In Telugu | Sakshi
Sakshi News home page

పెద్ది ఫస్ట్‌ రివ్యూ.. అంచనాలు పెంచేసిన సమంత

Jun 3 2026 7:00 PM | Updated on Jun 3 2026 9:06 PM

Peddi Movie First Review, Netizens Talk In Telugu

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం ఈ రోజు(జూన్‌ 3) రాత్రికే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కొంతమంది అయితే అప్పుడే రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. అందులో వాస్తవం ఉందో తెలియదు కానీ.. సినిమా సూపర్‌, రామ్‌ చరణ్‌ నటన అదిరిపోయిందంటూ ఎక్స్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి.

 

ఇదిలా ఉంటే.. సెన్సార్‌ సభ్యులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. క్రీడాకారుడిగా రామ్‌ చరణ్‌ నటన అదరగొట్టేశాడని సెన్సార్‌ సభ్యులు అన్నారట. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం కూడా ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింటని చెప్పారట. అంతేకాదు జాన్వీ కపూర్‌, జగపతి బాబు నటనపై కూడా ప్రశంసలు కురిపించారట.

మరోవైపు సినీ ప్రముఖులు కూడా సోషల్‌ మీడియా వేదికగా రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ..పెద్దిపై హైప్‌ క్రియేట్‌ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో సమంంత మాట్లాడుతూ.. 'నేను పెద్ది సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఇది పెద్ది టైమ్. చరణ్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరచబోతున్నాడు. ఈ పాత్ర కోసం అతను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నాకు ఈ సినిమాలో బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం టీమ్‌కు ఆల్ ది బెస్ట్' అంటూ తన శుభాకాంక్షలు తెలిపింది.  మరోవైపు సాయి దుర్గ తేజ్‌, వరుణ్‌ తేజ్‌తో పాటు పలువు టాలీవుడ్‌ హీరోలు కూడా పెద్ది టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌  చెబుతూ ట్వీట్స్‌ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement