నన్ను కసాయి అనుకున్నా పర్లేదు: కాజల్ అగర్వాల్ | Tollywood actress Kajal Aggarwal shocking comments about mother milk | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: నన్ను కసాయి అనుకున్నా పర్లేదు

Jul 24 2026 4:13 PM | Updated on Jul 24 2026 5:22 PM

Tollywood actress Kajal Aggarwal shocking comments about mother milk

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన లేటేస్ట్ మూవీ 'ది ఇండియా స్టోరీ'.  కల్తీ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో సందడి రిలీజైంది. ఇటీవల మన ఇండియాలో కల్తీపాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రతి రోజు మనం తాగే పాకెట్ పాలు మంచివి కావని తెలిపింది. కల్తీపై అవగాహన కల్పించడం కోసమే ది ఇండియా స్టోరీ మూవీని తీశారని పంచుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు కానీ.. నా కుమారుడికి మాత్రం నేను పాలు ఇవ్వనని తెలిపింది. ఈ విషయంలో నన్ను అందరూ కసాయి తల్లి అనుకున్నా సరే.. నాకే పర్లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఇంట్లోనే పన్నీరు తయారు చేసి ఇస్తానని కాజల్ తెలిపింది. ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

మనదేశంలో ఆహార కల్తీ విపరీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.. అంతేకాకుండా ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నటి కాజల్ అగర్వాల్ తెలిపింది. ఓ ప్రాజెక్ట్ రీసెర్చ్‌లో తాను షాకింగ్ విషయాలు తెలుసుకున్నా.. ఇటీవల ఓ కేసు గురించి విని పుచ్చకాయ తినడం మానేశానని కాజల్‌ చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement