ఏఐతో నటి అశ్లీల వీడియో, 11 ఏళ్ల కూతురిని కూడా వదల్లేదు! | Actress Anjana Singh Files FIr Over Obscene AI Video | Sakshi
Sakshi News home page

ఏఐతో నటి అశ్లీల వీడియో, 11 ఏళ్ల కూతురిని కూడా వదల్లేదు!

Jul 24 2026 3:08 PM | Updated on Jul 24 2026 3:24 PM

Actress Anjana Singh Files FIr Over Obscene AI Video

పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

టెక్నాలజీ అనేది మనిషి ఎదుగుదలకు తోడ్పడాలి కానీ , వికృత చేష్టలకు వేదిక కాకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దుర్వినియోగం చేస్తున్నారు. అశ్లీల ఫోటోలు, వీడియోలు సృష్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ముఖ్యంగా సినీ తారలకు ఏఐతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారిపై ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. 

తాజాగా భోజ్‌పురి నటి అంజానా సింగ్‌ కూడా డిజిటల్ వేధింపులకు గురైంది. తనతో పాటు తన 11 ఏళ్ల కుమార్తె కూడా అసభ్యకర వీడియోలు క్రియేట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. ఏఐతో ఫేక్‌ వీడియోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్నోలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

తాజాగా ఆమె ఓ నేషనల్‌ వార్త సంస్థతో మాట్లాడుతూ..గత కొన్ని రోజులుగా తానూ, తన చిన్నారి తీవ్ర మానసిక వేధింపులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత కొన్ని రోజులుగా  నాతో పాటు నా 11 ఏళ్ల కుమార్తెకు సంబంధించిన అసభ్యకరమైన ఏఐ ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. 

అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ, నన్ను బెదిరిస్తున్నారు. అంతేకాకుండా లక్నోకు రాకూడదని కూడా హెచ్చరికలు వస్తున్నాయి’అని ఆరోపించారు. ఈ ఘటన వెనుక బోజ్‌పురి స్టార్ ఖేసారి లాల్ యాదవ్ టీమ్ ప్రమేయం ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఖేసారి లాల్ మేనేజర్ అఖిలేష్ కాశ్యప్ ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై నటుడు ఖేసారి లాల్ యాదవ్ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement