ఆటా... పాటా... | VenkyANIL5 - NKRAR2 has successfully wrapped up an exciting first schedule | Sakshi
Sakshi News home page

ఆటా... పాటా...

Jul 24 2026 3:27 AM | Updated on Jul 24 2026 3:27 AM

VenkyANIL5 - NKRAR2 has successfully wrapped up an exciting first schedule

వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వెంకీఅనిల్‌ 5’ (వర్కింగ్‌ టైటిల్‌). రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా కీర్తి సురేష్, కల్యాణ్‌రామ్‌ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు.

అర్చన, జీ స్టూడియోస్, సురేష్‌ ప్రోడక్షన్స్‌ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుంది. కాగా, ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ముగిసిందని చిత్రబృందం పేర్కొంది. 

‘‘తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్‌ను నిర్మించాం. ప్రధాన తారాగణం పాల్గొనగా టాకీ పార్ట్‌తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించాం. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్‌గా ఉంటాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement