సూర్య హీరోగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమిత బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ అనే పాత్రలో నటించారు సూర్య.
గురువారం (జూలై 23) సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోని పెళ్లి పాట లిరికల్ వీడియో ప్రోమోను రిలీజ్ చేసి, ఈ పూర్తి పాటను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ఆజా అన్నాడే... రాజా చిన్నోడే... బాజా మోగించి తాళి కట్టేస్తాడే..’ అన్న లిరిక్స్ ఈప్రోమోలో వినిపిస్తాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి యూరప్‌లో ఓ కీలక షెడ్యూల్ జరిగింది.
యూరప్‌లో ఈ వెడ్డింగ్ సాంగ్‌ను చిత్రీకరించారని సమాచారం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను హీరో సూర్య పాడటం విశేషం. ఇక తనకంటే వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడైన హీరోను ఓ యంగ్ గర్ల్ ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది.


