కొరియన్ కనకరాజు.. రిలీజ్‌కు ముందే బిగ్‌ డీల్..! | Varun Tej Korean Kanakaraju OTT rights, deals goes viral | Sakshi
Sakshi News home page

Korean Kanakaraju Movie: కొరియన్ కనకరాజు.. రిలీజ్‌కు ముందే బిగ్‌ డీల్..!

Jul 24 2026 5:30 PM | Updated on Jul 24 2026 6:12 PM

Varun Tej Korean Kanakaraju OTT rights, deals goes viral

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న సినిమా 'కొరియన్ కనకరాజు'. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌, శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.26 కోట్ల వరకు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కేవలం రూ.38 కోట్ల బడ్డెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్‌ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement