రూ. 549 కోట్ల బ్రిడ్జ్‌పై పగుళ్లు : వీడియో తీస్తోంటే.. ట్విస్ట్‌! | Rs. 549 crores bridge crack while recording Bihar phone fall into | Sakshi
Sakshi News home page

రూ. 549 కోట్ల బ్రిడ్జ్‌పై పగుళ్లు : వీడియో తీస్తోంటే.. ట్విస్ట్‌!

Jun 5 2026 3:47 PM | Updated on Jun 5 2026 3:53 PM

Rs. 549 crores bridge crack while recording Bihar phone fall into

బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లోని జడోపూర్-మంగల్‌పూర్ వంతెనపై జరిగిన ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. రూ. 549 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన పిల్లర్ల వద్ద నిర్మాణం లోపాలను వీడియో తీయాలని భావించిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతను వీడియో తీస్తున్న ఆ పగులు గుండానే అతని మొబైల్ ఫోన్‌ కిందకి జారీ పోవడంతో  వార్తల్లో నిలిచాడు.

2016 మార్చిలోఈ వంతెనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో క్లిప్‌లో,  వంతెన పిల్లర్ల వద్ద, స్పాన్లలో భారీగా గ్యాప్‌లు, పగుళ్లు ఏర్పడడంతో అధికారులు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. అయితే ఈ పగుళ్ల గురించే అతను రికార్డ్ చేయాలను కున్నాడు. ఆ పగులు ఎంత పెద్దదిగా ఉందో చూపించడానికి ఒక ఇటుకను అందులోకి దించుతూమొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేస్తున్నాడు. ఇక్కడే అతని ప్రయత్నం బెడిసి కొట్టింది. మొబైల్ ఫోన్ చేతిలోంచి జారి ఆ గ్యాప్ గుండా వంతెన కింద పడిపోయింది.

ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్‌ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్‌

చివరికి వంతెన కింద పడిన ఫోన్‌ను సురక్షితంగానే వెలికితీశారు. కానీ, వంతెన లోపాన్ని చూపించబోయి సొంత ఫోన్‌నే పోగొట్టుకోబోయిన వైనంపై నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్‌ చేశారు. పనిలో పనిగా వంతెన నిర్మాణ నాణ్యత, నిర్వహణపై ప్రజలు సోషల్ మీడియాలో తీవ్ర ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పట్టుమని పదేళ్లు కూడా కాకముందే, గుంతలు, లోపాలు కనిపించడం విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఆ యువకుడి ఫోన్ దొరికి నప్పటికీ, వైరల్ వీడియోకి కారణమైన వంతెన నిర్మాణ లోపాలపై మళ్లీ  అందరి దృష్టి మళ్ళేలా చేసింది.

ఇదీ చదవండి: రొటీన్‌ లైఫ్‌ బోర్‌ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్‌ రైడ్స్‌తో రోజుకు రూ. 1500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement