పాట్నా: బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఘెర ప్రమాదం జరిగింది. బాగ్‌మతి నదిలో దాదాపు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బరువు తట్టుకోలేక నదిలో బోల్తాపడింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి నదిలో పడ్డవారిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాగ్‌మతి నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ నది దాటాల్సిందే. అయితే ఈ నదిపై ప్రభుత్వం వంతెన నిర్మించకపోవడంతో రోజూ గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు, ఇతర వ్యాపారులు తమ రోజువారీ పనులకోసం పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగా పడవలు నడిపే వారు సామర్థ్యంకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. వారు తక్షణమే స్పందించడంతోనే ఎవరికి ప్రాణాపాయం కలగలేదని చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పరిపాలనా యంత్రాంగం, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై స్పందించిన అధికారులు ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓవర్ లోడింగ్‌కు పాల్పడే నావికులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నదిలో నడిచే అన్ని పడవల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వంటి ప్రాణరక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని నావికులకు ఆదేశాలు జారీ చేశారు.
#BREAKING : Boat Carrying 40 Passengers Capsizes in Bihar's Bagmati River
A boat carrying around 35 to 40 passengers capsized in the Bagmati River in Bihar's Sitamarhi district after reportedly becoming overloaded. The vessel lost balance midstream and overturned, triggering… pic.twitter.com/4hatCRP27D— upuknews (@upuknews1) July 19, 2026


