తిరువనంతపురం: కేరళ శబరిమల భక్తులకు వాతావరణ శాఖ కీలక సూచన జారీ చేసింది. ఈ జూలై 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దీంతో అక్కడికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని రెయిన్ కోట్, గొడుగులు తమ వెంట తీసుకెళ్లాలని సూచించింది. గతంలో నాలుగు జిల్లాలకు జారీ చేసిన హెచ్చరికను ఈ రోజు (శనివారం) ఏడు జిల్లాలకు పెంచి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రానున్న 24 గంటల వ్యవధిలో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్లు వరకు భారీ వర్షపాతం కురుస్తుందని హెచ్చరిక జారీ చేసింది. పతనంతిట్ట , కొట్టాయం , ఇడుక్కి, మలప్పురం , కోజికోడ్ , కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్డ్ జారీ చేయగా తాజాగా మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ కాసరగోడ్లలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.
నైరుతి రుతపవనాలు బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం మీదుగా, ఉత్తర తమిళనాడు,దక్షిణ అంతర్గత కర్ణాటక ,ఉత్తర కేరళ వరకు విస్తరిస్తాయని అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


