రన్నింగ్‌ జస్ట్‌ ఫిట్‌నెస్‌ కాదు! అంతకుమించి.. | Helath Tips: Why Running Is More Than Just A Fitness Routine | Sakshi
Sakshi News home page

రన్నింగ్‌ జస్ట్‌ ఫిట్‌నెస్‌ కాదు! అంతకుమించి..

Jul 20 2026 10:54 AM | Updated on Jul 20 2026 11:18 AM

Helath Tips: Why Running Is More Than Just A Fitness Routine

ఆరోగ్యం కోసం వ్యాయామాలు, వాకింగ్‌ , రన్నింగ్‌ వంటివి అన్ని చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. చాలామంది రోజువారి దినచర్యలో భాగం కూడా. కానీ అదొక జస్ట్‌ రోజు చేసే ఒక సాధారణ దినచర్య కాదని, అంతకుమించి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అంటూ షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిజాయితీగా వెల్లడించిన ఆ అభిప్రాయం నెటిజన్ల మనసుని హత్తుకుంది. 

ఆ వీడియోలో ప్రఖర్‌ నేగి అనే ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారుడు తనకు 29 ఏళ్లు అని, స్థిరమైన ఉద్యోగం కూడా ఉందని చెప్పాడు. గురుగ్రామ్‌లో రాత్రి 7:30 గంటలకు తాను 15 కిలోమీటర్లు పరుగెత్తడానికి కారణం ఏదో తప్పనిసరి పరిస్థితులు కాదని, తనను కాపాడటానికి ఎవ్వరూ రారని తెలుసుకోవడమేనని అన్నారు. 

తాను సాధించాల్సిన లక్ష్యాలు తనంతట తానే సాధించుకోవాలని అన్నారు. ఇది అంగీకరించేందుకు కష్టంగా ఉన్నా..ఇదే నిజం అని అ‍న్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఆశావాదం పెంపొందించుకుంటే..ఏదైనా సాధ్యమేనని మనఃపూర్వకంగా విశ్వసించాలని అన్నారు. అలా రోజు చేయడం కాస్త కష్టం ఉన్నా..గొప్పగా లైప్‌ ఉండాలి, మరిన్ని చూడాలంటే తప్పదని అన్నారు. అలాంటి వాళ్ల గొప్ప విజయాలకు అర్హులని చెప్పారు. 

దయచేసి మీరు కూడా ఇలాంటి ఆశావాహ దృక్పథాన్నే అలవరుచుకోవాలని పిలుపునిస్తూ..అందరికీ  "హ్యాపీ రన్నింగ్" శుభాకాంక్షలని చెప్పారు. నెటిజన్లకు ప్రఖర్‌ పంచుకున్న ఆలోచనలు ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు..ఆరోగ్యంగా ఉండటంపై మంచి స్ఫూర్తినిచ్చారు, ధన్యవాదాలు అని పోస్టులు పెట్టడం విశేషం.

 

(చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement