భద్రత కట్టుదిట్టం.. మెట్రో బంద్‌ | CJP Protest 16 Metro Stations Closed At Delhi | Sakshi
Sakshi News home page

భద్రత కట్టుదిట్టం.. మెట్రో బంద్‌

Jul 23 2026 7:42 AM | Updated on Jul 23 2026 11:17 AM

CJP Protest 16 Metro Stations Closed At Delhi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7:30 గంటల నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.

ఇక, మెట్రో మూసివేత నిర్ణయం కారణంగా ప్రతిరోజూ మెట్రో సేవలపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా 16 మెట్రో స్టేషన్లను మూసివేసిన విషయం తెలిసిందే.

తాత్కాలికంగా మూసివేస్తున్న మెట్రో స్టేషన్లు:

 లోక్ కల్యాణ్ మార్గ్
  రాజీవ్ చౌక్
  పటేల్ చౌక్
  రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్
  బరఖంబా రోడ్
  సుప్రీం కోర్ట్
  సేవా తీర్థ్
  జనపథ్
  మండీ హౌస్
  సెంట్రల్ సెక్రటేరియట్
  ఐటీఓ
  ఢిల్లీ గేట్
  ఇంద్రప్రస్థ
  ఖాన్ మార్కెట్
  జోర్ బాగ్
  శివాజీ స్టేడియం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement