కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..! | Viral Post, Auto Driver Earns ₹45,000 A Month After Leaving ₹25K Salary Job, Inspires Netizens, Watch Video Inside | Sakshi
Sakshi News home page

కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!

Jul 19 2026 11:43 AM | Updated on Jul 19 2026 1:44 PM

Man Leaves Rs 25,000 Gurugram Job to Drive Autorickshaw Goes Viral

గిగ్‌ ఎకానమీ చాలామంది ఎలాంటి అవకాశాలు అందిస్తోందో చెప్పే వైరల్‌ పోస్ట్‌ ఇది. చదువు కోకపోయినా ఆర్థికం ఎలా నిలదొక్కుకున్నాడో వివరిస్తూ..నెటింట వైరల్‌గా మారాడు ఆ ఆటోడ్రైవర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కెర్లు కొడుతున్న ఈ పోస్ట్‌ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. 

ఆకాశ్‌ అనే ప్రయాణికుడు షేర్‌ చేశాడు ఈ పోస్ట్‌ని. తాను సాధారణంగా క్యాబ్‌లోనే వెళ్తానని, ఆ రోజు ఎందుకనో ఆటోటో వెళ్లాలనుకున్నాడు. సాధారణంగా మొదలైన ప్రయాణం ఆ ఆటోడ్రైవర్‌తో జరిగిన సంభాషణతో ఆసక్తికరంగా మారింది. ఆకాష్‌ ఆ డ్రైవర్‌ని ఎంత సంపాదిస్తారని ప్రశ్నించాడు. దానికి అతడు చెప్పిన సమాధానం ఆకాశ్‌ని అమితంగా ఆశ్చర్యపరిచింది. తన ఆదాయం స్థూల  అంచనాను చెబుతూ..ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 45 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. 

అలాగే గతంలో గురుగ్రామ్‌లో ఒక కంపెనీ రూ. 25 వేలు జీతంతో సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు తెలిపారు. రోజుకు రూ. 1500 నుంచి 2000 ఆర్జిస్తున్నాని, కేవలం ఎనిమిది గంటల డ్రైవింగ్‌ అని చెప్పాడు. నెలకు దగ్గర దగ్గర రూ. 50 నుంచి రూ 60 వేలు దాక సంపాదించగలనని అన్నారు. వాటిలో ఖర్చులోపోను కనీసం రూ. 40 వేలు దాక మిగలుతుందని అన్నారు. 

అంతేగాదు గిగ్‌ ఎకానమీ కల్పిస్తున్న ప్రయోజనాల గురించి అందరికీ తెలియాలంటూ పోస్ట్‌ని ముగించాడు. నెటిజన్లు సైతం ఆశ్చర్చపోతూ..నా జీతమే అతడికంటే తక్కువేమో అని ఒకరు, బెంగళూరు రండి అక్కడ ఆటోడ్రైవర్లు నెలకు కనీసం రూ. 2 లక్షల దాక సంపాదిస్తున్నారు అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ ఉద్యోగం వదిలేయడానికి.. ఏకంగా 74 లక్షల మూల్యం..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement