కోపం ఎవరిపై చూపించాలో అర్థం కాకపోతే... ఇలా చేయండి! | Tech Tamaram Cool Gadgets Funday Special Story | Sakshi
Sakshi News home page

కోపం ఎవరిపై చూపించాలో అర్థం కాకపోతే... ఇలా చేయండి!

Jul 19 2026 11:59 AM | Updated on Jul 19 2026 11:59 AM

Tech Tamaram Cool Gadgets Funday Special Story

టెక్‌ టమారం

ని మధ్యలో చిన్న బ్రేక్‌ కావాలన్నా, కోపాన్ని తగ్గించుకోవాలన్నా, చికాకును దూరం చేసుకోవాలన్నా, టెన్షన్‌ను కాస్త పక్కకు పంపాలన్నా, పిల్లలు సరదాగా ఆడుకోవాలన్నా... ఈ కూల్‌ గాడ్జెట్లు ఉండాల్సిందే! చేతులను బిజీగా, మనసును హ్యాపీగా ఉంచే బెస్ట్‌ టైమ్‌పాస్‌ గాడ్జెట్లు ఇవే!

కొట్టు... కూల్‌ అవ్వు!
బాస్‌పై కోపమా? మీటింగ్‌ వల్ల చిరాకా? చదువుతుంటే బుర్ర వేడెక్కిందా? ఎవరిపై చూపించాలో అర్థం కాకపోతే... ఈ డెస్క్‌టాప్‌ పంచింగ్‌ బ్యాగ్‌ రెడీగా ఉంది. టేబుల్‌పై దీన్ని అతికించి, కోపం వచ్చినప్పుడల్లా ఒక్క పంచ్‌ ఇవ్వండి. బలమైన స్ప్రింగ్‌ ఉండటంతో అది వెంటనే మళ్లీ మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు కొట్టండి– అది తిరిగి లేస్తుంది. ఇలా మీ కోపం తగ్గే వరకు కొనసాగించొచ్చు! బలమైన సక్షన్‌  బేస్‌ ఉండటంతో టేబుల్‌కు గట్టిగా అతుక్కుపోతుంది. ఆఫీస్‌ డెస్క్, చదువుకునే టేబుల్, ఇంటి వర్క్‌స్టేషన్‌ – ఎక్కడైనా సులభంగా అమర్చుకోవచ్చు. చిన్న సైజులో ఉండటంతో ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు. ధర కేవలం రూ. 500 మాత్రమే.


నొక్కు... నవ్వు!
బస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా; టైమ్‌ పాస్‌ కావాలన్నా; క్లాస్‌లో బోర్‌ కొడుతున్నా; చేతులు ఖాళీగా ఉంటే నిమిషం కూడా గడవదా? అయితే ఈ ఫిడ్జెట్‌ ప్యాడ్‌ మీ కోసమే! చూడటానికి చిన్న గేమింగ్‌ కంట్రోలర్‌లా కనిపించే ఈ గాడ్జెట్‌లో ఒకటి కాదు, ఏకంగా ఎనిమిది రకాల ఫిడ్జెట్‌ ఫీచర్లు ఉన్నాయి. బటన్లు నొక్కడం, జాయ్‌స్టిక్‌ను తిప్పడం, గేర్‌ను తిప్పడం, స్లైడర్‌ను జరపడం, స్విచ్‌ను క్లిక్‌ చేయడం... ఇలా వేళ్లకు ఎప్పుడూ చిన్న పని ఉంటుంది. బోర్‌ కొట్టినా, టెన్షన్‌  పెరిగినా, ఎదురు చూస్తున్నా– చేతులు మాత్రం బిజీగా ఉంటాయి. చిన్నగా, తేలికగా ఉండటంతో జేబులో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్, కాలేజీ, ట్రావెల్‌– ఎక్కడైనా క్షణాల్లో బోర్‌ను తరిమికొట్టే సరదా గాడ్జెట్‌ ఇది. ధర రూ. 500.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement