లక్నో: అయోధ్య తపస్వీకి ఛావని మఠం అధిపతి, జగద్గురు పరమహంస ఆచార్య.. ఆమిర్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమిర్ ఖాన్‌ని చంపిన వారికి రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతే కాకుండా అతనిని చంపిన వ్యక్తికి ఎదురయ్యే న్యాయపరమైన ఖర్చులను తానే భరిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆమిర్ ఖాన్ మూడోపెళ్లిపై లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరమహంస ఈ విధంగా మాట్లాడారు.
వివాదం ఎందుకు
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే షిర్డీలో మీడియాతో మాట్లాడుతూ “ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, హిందూ సమాజం దాని గురించి ఆలోచించాలి. ఇది నా అభిప్రాయం. లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆమిర్ ఖాన్ అలా మారడం లేదా? అతని సినిమాలు చూసే హిందూ యువత, అలాంటి నటులను పెద్ద స్టార్లుగా చేసే ముందు వివేకంతో ఆలోచించాలి.” అని అన్నారు దీంతో ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.
జగద్గురు పరమహంస ఆచార్య స్పందన
నితేష్ రాణే చేసిన “లవ్ జిహాద్” వ్యాఖ్యను సమర్థిస్తూ పరమ , జగద్గురు పరమహంస ఆచార్య, ఆమిర్ “లవ్ జిహాద్”ను ప్రోత్సహించడానికే ఒక హిందూ మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ హిందూ మహిళలను "ఉచ్చులో" పడేస్తున్నారన్నారు ఆమిర్ ఖాన్ మూడుసార్లు వివాహం చేసుకున్నారని, ఆ మూడు వివాహాలు కూడా హిందూ మహిళలతోనే జరిగాయని పరిగణనలోకి తీసుకుంటే, నితేష్ రాణే చేసిన ప్రకటన ఆరోపణ కాదు, అది ఒక వాస్తవం. ఇలాంటి వారిపై తక్షణమే చర్య తీసుకోవాలి. వారు సమాజంలో అనైక్యత సృష్టిస్తూ, అతను 'లవ్ జిహాద్' అని మిషనను ప్రోత్సహిస్తూ సమాజానికి తీవ్రమైన నేరం చేస్తున్నారని ఆరోపించారు.
ఆమిర్‌ను చంపితే ఐదుకోట్లు
పరమహంస మాట్లాడుతూ" ఏ విధంగానైనా ఆమిర్ ఖాన్‌ను ఎవరు చంపినా, వారి న్యాయపరమైన ఖర్చులన్నీ నేనే భరిస్తా వారి కుటుంబానికి రూ. 5 కోట్లు ఇస్తా, నా దృష్టిలో 'లవ్ జిహాద్'ను ప్రోత్సహించే అలాంటి 100-200 మందిని హతమార్చగలిగితే, 'లవ్ జిహాద్' పూర్తిగా అంతమవుతుంది". అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెళ్లి
ఆమిర్ ఖాన్ జూలై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ను మూడో వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రా పాలి హిల్‌లో ఉన్న ఆయన నివాసంలో ఈ వివాహం అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ పద్ధతిలో జరిగింది.


