34 మందిని కాపాడి, ఆ బస్‌ కిందే నలిగిపోయిన డ్రైవర్‌ | Uttarakhand Bus Driver Sacrifices His Life To Save 34 Passengers After Brake Failure In Champawat, More Details Inside | Sakshi
Sakshi News home page

34 మందిని కాపాడి, ఆ బస్‌ కిందే నలిగిపోయిన డ్రైవర్‌

Jun 4 2026 4:23 PM | Updated on Jun 4 2026 5:09 PM

Uttarakhand bus driver sacrifices his life to save 34 passengers

ఉత్తరాఖండ్‌లోని చంపావత్ సమీపంలో బ్రేకులు ఫెయిలైనా, చాకచక్యంగా బస్సును కొండవైపునకు మళ్లించి భారీ ప్రమాదాన్ని తప్పించాడు. కానీ దురదృష్టవశాత్తు బస్‌ డ్రైవర్‌ మాత్రం అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ధార్‌చూలా–తానాపూర్‌ మార్గంలో లోహాఘట్‌ వద్ద బుధవారం ఉదయం జరిగింది. ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యతనిచ్చిన సాహసిక డ్రైవర్‌కు నెటిజన్లు సలాం చెబుతున్నారు.

ఉత్తరాఖండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సు ధార్చులా నుండి తానక్‌పూర్‌కు వెళ్తున్న బస్సు, పల్లపు ప్రాంతంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బస్సు నేరుగా కొండ అంచు నుంచి బస్సు లోయలోకి పడే ప్రమాదం ఉండటంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్‌ బస్సులోని 34 మంది ప్రాణాలను కాపాడాడు.  కానీ అనూహ్యంగా డ్రైవర్ బేనీరామ్ థ్వాల్ (49) ప్రాణాలు కోల్పోయాడు బస్సును ఎలాగైనా ఆపేయాలనే ఉద్దేశంతో కుడివైపు కొండను ఢీకొట్టాడు. ఈ క్రమంలో డ్రైవర్‌ సీటు నుంచి ఎగిరిపడి బస్సు ముందు చక్రం కింద పడ్డాడు. బస్సు అలాగే ముందుకు కదలి అతనిపై నిలిచి ఆగిపోయింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోవడం  తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు

ఒక మహిళకు స్వల్ప గాయాలవ్వగా, మిగతా ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారని ఉత్తరా ఖండ్ రవాణా సంస్థ తానక్‌పూర్ విభాగం అసిస్టెంట్ రీజినల్ మేనేజర్ సురేష్ పాండే తెలిపారు. ప్రాణాలకు తెగించి జనాలను కాపాడి వీరమరణం పొందిన బస్సు డ్రైవర్‌ బేనీరాం థావల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ అంజలి ఘటించారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!



 

Advertisement
 
Advertisement
Advertisement