ఢిల్లీలో కశ్మీర్‌ సీఎం నిరసన  | CM Omar Abdullah Leads NC Protest In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కశ్మీర్‌ సీఎం నిరసన 

Jul 21 2026 4:32 AM | Updated on Jul 21 2026 4:35 AM

CM Omar Abdullah Leads NC Protest In Delhi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు తక్షణమే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు సోమవారం ఢిల్లీలో నిరసన చేపట్టారు. రాష్ట్రహోదా పునరుద్ధరణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే వారు ఈ నిరసన చేపట్టినప్పటికీ కాక్రోచ్‌ జనతాపార్టీ ఆందోళన కారణంగా మరుగునపడి పోయింది. 

జమ్మూ నుంచి సీఎం ఒమర్‌ సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ జంతర్‌మంతర్‌ వద్ద పోలీసుల భారీ బందోబస్తు కారణంగా నిరసన వేదిక వద్దకు చేరుకోలేకపోయారు. సాయంత్రం కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో తలపెట్టిన రాష్ట్ర హోదాపై సదస్సును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ‘రిస్టోర్‌ స్టేహుడ్‌’అని ఉన్న జాకెట్‌తో అశోకా రోడ్‌లో పేమెంట్‌పై బైటాయించిన సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు సీజేపీ నిరసనకారులు కొందరు జతకలిశారు. అక్కడ గుంపు పెద్దదవడంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌తో వారందరినీ చెదరగొట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement