సీజేపీ నిరసన పునః ప్రారంభం | CJP resumed its agitation | Sakshi
Sakshi News home page

సీజేపీ నిరసన పునః ప్రారంభం

Jul 21 2026 2:10 AM | Updated on Jul 21 2026 4:43 AM

CJP resumed its agitation

ఢిల్లీ: జంతర్‌ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ  (సీజేపీ) నిన్న సోమవారం రాత్రి 10:30 గంటలకు తిరిగి ప్రారంభించింది. యాథావిధిగా తమ వేదికను ఏర్పాటు చేసుకొని నిరసన కొనసాగిస్తుంది. కాగా నిన్న (సోమవారం) సీజేపీ పార్లమెంటుకు  నిర్వహించిన మార్చ్ సందర్భంగా, నిరసనకారులకు, పోలీసులకు మధ్య పెద్దఎత్తున ఘర్షణలు చెలరేగాయి. దీంతో పోలీసులు  సాయంత్రం 5 గంటలకు జంతర్ మంతర్‌ను ఖాళీ చేయించారు.

సీజేపీ ఆందోళన హింసాత్మకం
కాగా నిన్న (సోమవారం) సీజేపీ పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారింది.   నిరసన కారుల దాడుల్లో ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లిందని పోలీసులు పేర్కొన్నారు. ఘర్షణల్లో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని 20కి వాహనాలు  ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.  అదే విధంగా 60 మంది నిరసనకారులకు గాయాలయ్యాయని తెలిపారు.

నిరసనలు ఎందుకు? 
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పర్యావరణ వేత్త సోనమ్‌ వాంగ్ ‍చుక్‌  జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేశారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందనే నెపంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని ప్రభుత్వం చేసిన "అపహరణ"గా భావించిన యువత, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని నిరసనను ఉధృతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement