మధుర: హర్యానాకు చెందిన గాయని కాజల్ చౌదరి తన అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చడానికి చేసిన ప్రయత్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 260 కి.మీ.ల పరిధిలోని సరస్సులు, అటవీ ప్రాంతాలను దాటుకుంటూ చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర నెట్టింట వైరల్‌గా మారింది. '84-కోసుల' బ్రజ్ పరిక్రమలో ప్రత్యేక బుట్టలో తన 90 ఏళ్ల అత్తగారిని తలపై మోసుకెళ్తున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకున్నారు.
బ్రజ్ ప్రాంతపు మతపరమైన ప్రదక్షిణను పూర్తి చేయాలన్న కోరికే తీర్చేందుకు అత్తగారిని మోసుకెళ్లాలని స్వయంగానే తానే నిర్ణయించుకున్నానని, ఇందులో అత్తగారి ప్రమేయం ఏదీ లేదని స్పష్టం చేశారు. సుమారు 260 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ 84-కోసుల బ్రజ్ పరిక్రమ, ఉత్తరప్రదేశ్, హర్యానా ,రాజస్థాన్ రాష్ట్రాల గుండా సాగుతూ, శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడి ఉన్న అనేక ముఖ్యమైన ప్రదేశాలు, కొలనులు , అరణ్యాల గుండా వెళుతుంది.
ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!
సాధారణంగా భక్తులు ఈ తీర్థయాత్రను పూర్తి చేయడానికి సుమారు 40 రోజుల సమయం తీసుకుంటారు, కానీ చాలామంది భక్తులు ప్రస్తుతం నడుస్తున్న 'అధిక మాసం' (Adhik Mas) లోనే దీనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని గోవర్ధన్‌లోని శ్రీ ధన్‌ఘాటి ఆలయ సేవాయత్ (పూజారి) పవన్ కౌశిక్ తెలిపారు .హిందూ క్యాలెండర్‌లో వచ్చే ఈ అధిక మాసాన్ని 'పురుషోత్తమ మాసం' అని కూడా పిలుస్తారని, ఈ మాసంలో బ్రిజ్ పరిక్రమ్ ఆధ్యాత్మిక యాత్ర, ఆలయాల్లో పూజలు చేయడం ,యజ్ఞాలు నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్‌లో ప్రకంపనలు
सासू मां की इच्छा पूरी करने के लिए बहू ने लिया अनूठा संकल्प।
सिर पर बैठाकर बहू ने सासू मां को कराई 84 कोस की परिक्रमा।
रिश्तों में सेवा, समर्पण और सम्मान की मिसाल ।
उत्तर प्रदेश के ब्रज क्षेत्र से एक भावुक कर देने वाला वीडियो।
ऐसी संस्कारी बहू जिस घर में आ जाए वह घर स्वर्ग… pic.twitter.com/HWDRD4oLiQ— Satish Rajput (@StanwarSatish) June 4, 2026


