ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు | Alpha 2026 And Jagannath Movies OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movies: ఒకే ఓటీటీలోకి వచ్చిన రెండు మూవీస్

Apr 21 2026 12:28 PM | Updated on Apr 21 2026 12:42 PM

Alpha 2026 And Jagannath Movies OTT Streaming Now

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో చాలామంది దృష్టి ఓటీటీలపై(OTT Movies) పడింది. వీటిలో కొత్త సినిమాలు ఏమున్నాయా? అని చూస్తున్నారు. మరి ముఖ్యంగా తెలుగు చిత్రాలు ఏమేం అందుబాటులో ఉన్నాయా అని సెర్చ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే గతవారం సంభవం అధ్యాయం ఒన్ను, సుయోధన, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, అస్సీ తదితర చిత్రాలతో పాటు పోచమ్మ అనే తెలుగు సిరీస్ కూడా రిలీజైంది.

(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

మరోవైపు ఈ వారం కూడా బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, హ్యాపీరాజ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతున్నాయి. ఇవలా ఉండగానే రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇందులో ఒకటి స్ట్రెయిట్ మూవీ కాగా మరొకటి డబ్బింగ్ బొమ్మ.

ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలోకి వచ్చిన 'జగన్నాథ్'(Jagannath Movie) అనే తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రాయలసీమ భరత్, నిత్య, అజయ్, బాహుబలి ప్రభాకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇకపోతే 'ఆల్ఫా'(Alpha: Men Love Vengeance Movie) పేరుతో తీసిన కన్నడ డబ్బింగ్ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రివేంజ్ స్టోరీగా దీన్ని తీశారు. మగాళ్లు అహంకారం, కోపం కారణంగా ఎక్కడివరకు వెళ్తారు? ఈ క్రమంలోనే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషనల్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement