సుష్టుగా గడ్డి భోంచేస్తున్న యువకుడు : వైరల్‌ వీడియో | A bizarre viral video a man casually eating animal fodder | Sakshi
Sakshi News home page

సుష్టుగా గడ్డి భోంచేస్తున్న యువకుడు : వైరల్‌ వీడియో

Jun 4 2026 3:30 PM | Updated on Jun 4 2026 3:53 PM

A bizarre viral video  a man casually eating animal fodder

సోషల్‌ మీడియా అంటే విచిత్రాలు, వింతల  పుట్ట. తాజాగా ఒక విచిత్రమైన  వీడియో సోషల్ మీడియాను సంచలనం రేపుతోంది.  ఒక యువకుడు పశువుల మేతను తింటున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పశువుల కంటే  ఇష్టంగా, ఎంతో హాయిగా, మహా ప్రసాదంలా కళ్లకద్దుకుని మరీ గడ్డిని భోంచేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు  చుట్టూ ఉన్నవారంతా ఇతడిని ఉత్సాహపరుస్తుండటం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 

ఈ వీడియో ప్రామాణికత, ఉద్దేశ్యం, ఎక్కడిది? ఆ యువకుడు ఎవరు? ఎందుకు తింటున్నాడు అనే దానిపై స్పష్టత లేదు.  కానీ మతపరమైన లేదా మూఢనమ్మకపు ఆచారంలో భాగంగా ఆవుల కోసం ఉద్దేశించిన మేతను తింటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు దీన్నొక సాంస్కృతిక ఆచారంగా భావిస్తుండగా, మరికొందరు పశువుల కోసం ఉద్దేశించిన మేతను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశువుల మేత అనేది పశువులకు మాత్రమే ఉద్దేశించింది. అది మానవ ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం దానిని తయారు చేయడం, నిల్వ చేయడం లేదా ప్రాసెస్ చేయడం లాంటివి ఉండవు. అటువంటి పదార్థాలను తినడం వల్ల కలుషితాలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో ప్రాణాపాయం ప్రమాదం పెరగవచ్చు.

ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!

మరోవైపు దీనిపై ఆహార నిపుణులు, వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీల్స్‌ కోసమో, సోషల్‌ మీడియాలో ఆదరణ కోసమో ఇలాంటి అసాధారణ చర్యలకు పూనుకోవద్దని హితవు చెబుతున్నారు.   ఇలాంటి వాటిని మనుషులు జీర్ణం చేసుకోలేని, తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 

ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement