మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు | Khushboo Daughter Wedding Invites CM Vijay | Sakshi
Sakshi News home page

Khushboo Meets CM Vijay: కుమార్తె పెళ్లి.. సీఎం విజయ్‌కి ఆహ్వానం

Jun 3 2026 12:45 PM | Updated on Jun 3 2026 12:51 PM

Khushboo Daughter Wedding Invites CM Vijay

సినీ నటి ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి త్వరలో జరగనుంది. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని అతడి స్వగృహంలోనే కలిసి పెళ్లి కార్డ్ అందజేశారు. ఈ క్రమంలోనే ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)

'ఇది మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఆయన నివాసంలోనే కలిసి శ్రీ శ్రవణ్ శ్రీనివాసన్‌తో జరగనున్న నా కుమార్తె పెళ్లికి ఆహ్వానించాం.  విజయ్‌ను కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నా కూతుళ్లు ఆయనని చూసి ఎంతో ఉత్సాహానికి గురయ్యారు. ఆయనతో గడిపిన క్షణాలను ఆస్వాదించారు. తన బిజీ షెడ్యూల్‌లోనూ విజయ్ ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో స్వాగతం పలికారు. ఎప్పటిలాగే తన చిరునవ్వుతో మమ్మల్ని ఆత్మీయంగా పలకరించారు. విజయ్ అందించిన ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.

ఖుష్బూ దంపతుల చిన్న కుమార్తె అయిన అవంతిక నటిగా మలయాళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘ఆరంభం’ అనే చిత్రంలో ఆమె యాక్ట్‌ చేస్తున్నారు. పెద్ద కుమార్తె ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

(ఇదీ చదవండి: 'ఇరుముడి' గ్లింప్స్.. కొత్తగా కనిపించిన రవితేజ)

Advertisement
 
Advertisement
Advertisement