రవితేజ మంచి నటుడే కానీ గత కొన్నాళ్ల నుంచి ఒకే తరహా సినిమాలు తీసి తీసి బోర్ కొట్టించేస్తున్నాడు. ప్రస్తుతం 'ఇరుముడి' అనే మూవీ చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్‌ని పెద్దగా హడావుడి లేకుండానే రిలీజ్ చేశారు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ కొత్తగా.. సాధారణ షర్ట్, లుంగీతో కనిపించాడు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)
గ్లింప్స్ బట్టి చూస్తే గ్రామంలో ఉండే హీరో, అతడికో కూతురు. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ హీరోకి మందు అలవాటు. వ్యసనాన్ని మానేయమని కూతురు అడుగుతుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? అయ్యప్ప స్వామి మాల ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనేది కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. జీవీ ప్రకాశ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా బాగుంది. ఆగస్టులో మూవీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా)


