కలలే... కథలే పెంచే..! | Sandeep Reddy Vanga releases Romanchakam first single Radha Ramana | Sakshi
Sakshi News home page

కలలే... కథలే పెంచే..!

Jul 24 2026 3:49 AM | Updated on Jul 24 2026 3:49 AM

Sandeep Reddy Vanga releases Romanchakam first single Radha Ramana

సుమంత్‌ ప్రభాస్, అనంతిక

‘‘రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో... ఏదో తపన తాగేసి వయసులు ఊగే వేళలో... ఓ కన్నా నీ అందమే అలలై అలలై ముంచే..’ అంటూ సాగుతుంది ‘రాధా రమణ’ పాట. సుమంత్‌ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్‌ జంటగా నటించిన ‘రోమాంచకం’ సినిమాలోనిది ఈ పాట. వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 3న రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా నుంచి ‘రాధా రమణ’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘కన్నుల్లో అందుకే కలలే... కథలే పెంచే, ఆవేశమే తెరచాటుగా లాగగా, బిడియాల ఆదేశమే  పొరపాటనీ ఆపగా, ఈ ఊగిసలో, ఉందనా లేదనా...’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్‌ ఈ పాటకు సాహిత్యం అందించగా, ఈ చిత్రసంగీత దర్శకుడు వాసుకి వైభవ్‌ పాడారు. ‘‘ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement