ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ షురూ | Sailu Kampati second film begins with Sumanth Prabhas | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ షురూ

Jul 21 2026 12:19 AM | Updated on Jul 21 2026 12:19 AM

Sailu Kampati second film begins with Sumanth Prabhas

సుమంత్‌ ప్రభాస్, అడివి శేష్‌

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీతో దర్శకుడిగా హిట్‌ అందుకున్న సాయిలు కంపాటి దర్శకత్వంలో రెండో సినిమా షురూ అయింది. ఈ మూవీలో సుమంత్‌ ప్రభాస్‌ హీరో. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు, భరత్‌ నారంగ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం సికింద్రాబాద్‌ గణేష్‌ ఆలయంలో పూజ తో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శేఖర్‌ కమ్ముల కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో అడివి శేష్‌ క్లాప్‌ కొట్టారు. తొలి షాట్‌ను సాయిలు కంపాటి డైరెక్ట్‌ చేయగా, సదానంద్‌ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ‘‘చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ , ఎంటర్‌టైన్ మెంట్‌కు ప్రాధాన్యం ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement