ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఫ్యాన్స్ బాగా ఎదురుచూస్తున్నదైతే 'స్పిరిట్'. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో చాలా హైప్ క్రియేట్ అయిపోయింది. వచ్చే ఏడాది మార్చి తొలివారంలో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి.. క్రేజీ అప్‌డేట్ బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)
షూటింగ్ గురించి ఎదురైన ప్రశ్నకు బదులిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటివరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. మీ అందరికీ అది నచ్చుతుందనే అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. తృప్తి దిమ్రి హీరోయిన్.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. 'స్పిరిట్'ని మరింత వైలెంట్‌గా తీస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. రాబోయే రోజుల్లో వచ్చే అప్‌డేట్స్ బట్టి ఏ రేంజ్ వయలెన్స్ అనేది క్లారిటీ వస్తుంది.
(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)
40% of the shoot completed 🔥🔥🔥🔥#Prabhas | #Spirit | #SRV 💥💥💥 pic.twitter.com/2iPVg2ssd2
— Movies4u Official (@Movies4u_Officl) July 19, 2026


