నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్ | Actress Sharmiela Mandre Wedding With Producer Sudhan Sundaram In A Private Ceremony, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sharmiela Mandre: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన ప్రముఖ హీరోయిన్

Jul 19 2026 3:23 PM | Updated on Jul 19 2026 3:56 PM

Sharmiela Mandre Wedding With Producer Sudhan Sundaram

తెలుగులో ఓ సినిమాలో నటించిన హీరోయిన్ షర్మిలా మాండ్రే పెళ్లి చేసుకుంది. తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలని కాస్త ఆలస్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో తోటీ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)

స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన షర్మిలా మాండ్రే..2007 నుంచి దక్షిణాదిలోని తెలుగు, కన్నడ, తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో 2013లో వచ్చిన అల్లరి నరేశ్ 'కెవ్వు కేక' మూవీలో హీరోయిన్‌గా చేసింది. తమిళంలోనూ హీరోయిన్ కమ్ నిర్మాతగా పలు చిత్రాల్లో నటించింది. మరి ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్‌షిప్ మెంటైన్ చేసింది.

గత నెల 28న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ నెల 12వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోలని వారం రోజులు ఆలస్యంగా షర్మిలా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మిస్టర్ అండ్ మిసెస్ సుందరం అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం షర్మిలా తమిళంలో ఓ మూవీ చేస్తుండగా, సుధాన్ తన ప్యాషన్ స్టూడియోస్ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే విజయ్ సేతుపతితో 'మహారాజా' నిర్మించింది ఈయనే.

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో ప్రిన్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement