మెగా158లో సీనియర్ హీరో..! | Megastar Chiranjeevi Mega 158 Gets Bigger, Sarathkumar Rumoured To Play A Crucial Character, Deets Inside | Sakshi
Sakshi News home page

మెగా158లో సీనియర్ హీరో..!

Jul 19 2026 3:19 PM | Updated on Jul 19 2026 3:58 PM

Senior actor Sarath kumar will join in Megastar chiranjeevi latest Movie

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం మెగా 158(వర్కింగ్‌ టైటిల్‌). వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత వీరిద్దరు మరోసారి జతకట్టారు. ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో  వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు 'కాకాజీ' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అనశ్వర రాజన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో నివేతా పేతురాజ్‌ నటిస్తున్ననట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరల్‌గా మారింది.  ఈ చిత్రంలో సీనియర్ హీరో శరత్ కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ కుమార్ పాత్రతో పాటు ఈ చిత్రంలో మరో స్పెషల్ పాత్ర కూడా ఉంటుందని సమాచారం.. అది కూడా నెగిటివ్ రోల్ అని లేటేస్ట్ టాక్. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్‌ తమన్ సంగీతమందిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement