చివరి నిమిషంలో షాకిచ్చిన 'రామాయణ' మేకర్స్ | Ramayana Movie Trailer Latest Update, Global Launch Postponed For This Reason, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్ రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?

Jul 24 2026 9:10 AM | Updated on Jul 24 2026 9:50 AM

Ramayana Movie Trailer Latest Update And Postponed

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన సినిమా 'రామాయణ'. ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్ లాంచ్ చేశారు. అయితే దీనిని ఈ రోజు(జూలై 24) యూట్యూబ్‌లో విడుదల చేస్తామని కొన్నిరోజుల ముందే ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఇప్పుడు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అందుకు గల కారణాన్ని కూడా నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.

(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ)

నా సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే నా కల ఇప్పుడు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో నిజమైంది. అందువల్ల ట్రైలర్ విడుదలని ముందుగా అనుకున్నట్లు కాకుండా వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీన గ్లోబల్ లాంచ్ చేయనున్నాం. భారతీయ సినీ చరిత్రలో 100 ఏళ్లకు పైగా ఇది ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలుస్తుంది. అంతర్జాతీయంగా రిలీజ్ చేయడంతో 'రామాయణ' ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది.

ఈ సినిమాతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అని నమిత్ మల్హోత్రా ఓ నోట్ రిలీజ్ చేశారు.

ఇప్పటివరకు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చే క్రమంలోనే వాయిదాల మీద వాయిదాలు పడటం చూస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్స్‌ని కూడా వాయిదా వేస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరగడం బదులు నెగిటివిటీ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన 'రామాయణ' గ్లింప్స్‌కి ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు. ట్రైలర్ అయినా బాగుంటే పర్లేదు లేదంటే మాత్రం మూవీ హైప్‌పై ఇది ప్రభావం చూపిస్తుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement