ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా | Purushaha Movie Released In OTT, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT: సడన్‌గా ఓటీటీలో తెలుగు మూవీ స్ట్రీమింగ్

Jul 24 2026 8:47 AM | Updated on Jul 24 2026 9:24 AM

Purushaha Movie OTT Streaming Now

ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. వాటిలో నాగబంధం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి లాంటి డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. మరోవైపు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు వచ్చాయి. వీటికి తోడుగా ఓ తెలుగు కామెడీ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)

కమెడియన్స్ సప్తగిరి, రాజ్ కసిరాజుతో పాటు పవన్ కల్యాణ్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటించిన కామెడీ మూవీ 'పురుషః'. ఈ ఏడాది మే 22న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఉన్నప్పటికీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

'పురుషః' విషయానికొస్తే..చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులైన గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజన్ కుమార్), కిస్ (వెన్నెల కిశోర్) ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. పెద్దయ్యాక వీళ్లకు పెళ్లిళ్లు అవుతాయి. గోవింద్‌.. కమల (రాయంచ)ని ప్రేమించి పెళ్లి చేసుకోగా, సత్తిబాబుకు లక్ష్మి (హాసిని)తో, శ్రీనుకు గీత (విషిక)తో వివాహమవుతుంది. అయితే వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగదు. నిత్యం గొడవలతో విసిగిపోయిన భార్యలే.. తమకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు.

విడాకుల కోసం భర్తలు కూడా కోర్టు చుట్టూ తిరుగుతుంటారు కానీ భార్యలు మాత్రం రారు. దీంతో కేసు వాయిదాల మీద వాయిదా పడుతుంటుంది. వీరి బాధను అర్థం చేసుకున్న జడ్జి (వీటీవీ గణేష్‌) అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇంతకీ గోవింద్‌, కమల ప్రేమ కథ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు. సత్తిబాబు, శ్రీనులపై వారి భార్యలకు ఎందుకు అంత అనుమానం? వీరి కాపురం కూల్చడంలో స్నేహితుడు 'కిస్' పాత్ర ఏంటి? చివరికి ఈ భార్యాభర్తల కథ ఎలాంటి ముగిసిందనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement