దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.450 విలువైన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. తక్కువ కాలపరిమితితో వచ్చినప్పటికీ, రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు AI సేవలు, OTT ప్రయోజనాలు కలిపి ఈ ప్లాన్‌ను ఆకర్షణీయంగా మార్చాయి. ప్రస్తుతం ఈ ప్లాన్ జియో అధికారిక వెబ్‌సైట్, మైజియో యాప్ ద్వారా అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్‌లో 36 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా (మొత్తం 72GB), అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. 5G స్మార్ట్‌ఫోన్ కలిగి, జియో True 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా అందుబాటులో ఉంటుంది.
డేటా, కాలింగ్‌తో పాటు ఈ ప్లాన్‌లో మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో ఏఐ క్లౌడ్‌లో 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తాయి. అంతేకాదు, అర్హత కలిగిన వినియోగదారులకు 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఉచితంగా అందిస్తోంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.35,100గా జియో పేర్కొంటోంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా అధునాతన జెమినై ఏఐ ఫీచర్లు, డీప్ రీసెర్చ్, నానో బనానా ఇమేజ్ టూల్స్, గూగుల్ వర్క్‌స్పేస్ ఏఐ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు.
అయితే గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనం కొనసాగాలంటే వినియోగదారులు జియో నిర్దేశించిన అర్హత గల ప్లాన్‌లతో నిరంతరం రీఛార్జ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతం జియో నిబంధనల ప్రకారం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ అర్హత గల అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను కొనసాగిస్తేనే ఈ ఏఐ సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే జియో హాట్‌స్టార్ ప్రయోజనాలు కూడా ఆఫర్ నిబంధనలకు లోబడి ఉంటాయి.


