ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Tamil Latest Movie Ego Raman Streaming On this Otts from This date | Sakshi
Sakshi News home page

Ego Raman Movie: ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jul 23 2026 3:39 PM | Updated on Jul 23 2026 4:12 PM

Tamil Latest Movie Ego Raman Streaming On this Otts from This date

ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదువ లేకుండా పోయింది. ఏ భాషలో రిలీజైనా సరే డబ్బింగ్ వర్షన్‌లో ఓటీటీలో చూసేస్తున్నారు. ఓటీటీలతో కొత్త కొత్త కంటెంట్, మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తోంది. తాజాగా మరో లేటేస్ట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.

ఈ ఏడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్‌ మూవీ ఈగో రామన్. ఈ మూవీకి గణేషన్ నాచిముత్తు దర్శకత్వం వహించారు. ఒక సివిల్ సర్వీస్ ఆశించే యువకుడికి, అతని మాజీ ఉపాధ్యాయుడికి మధ్య జరిగే మానసిక సంఘర్షణ, అహం (ఈగో) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం జూలై 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి రానుంది. అమెజాన్‌తో పాటు ఓవర్‌సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సిబి చంద్రన్, రోబో శంకర్, కీర్తన శ్రీకుమార్, కవిత రమేష్ ప్రధాన పాత్రలు పోషించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement