ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇమ్తియాజ్ అలీ తెరకెక్కించిన తాజా చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినప్పటికీ, భారీ వసూళ్లతో ఈ సినిమా తన విజయపరంపరను కొనసాగిస్తోంది.
సినిమాకు లభిస్తున్న అద్భుత ఆదరణ నేపథ్యంలో దర్శకుడు ఇమ్తియాజ్ అలీ హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో అభిమానులు, ప్రేక్షకులను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మొదట నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ప్రేక్షకుల మౌత్ టాక్‌తో ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన వల్లే థియేటర్లలో షోల సంఖ్య గణనీయంగా పెరిగింది’ అని ఇమ్తియాజ్ అలీ అన్నారు.
హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, ప్రస్తుతం భారత్‌లో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 59 దేశాల్లో, 804 స్క్రీన్‌లపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు.


