చెన్నైతో నా లవ్ స్టోరీ: చిరంజీవి | Megastar Chiranjeevi Shares Nostalgic Chennai Memories In Chennai Love Story Pre-release Event, Read Story Inside | Sakshi
Sakshi News home page

చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్‌లో చిరంజీవి చెన్నై జ్ఞాపకాలు

Jul 22 2026 11:14 PM | Updated on Jul 23 2026 11:34 AM

Megastar Chiranjeevi Chennai memories in Chennai Love Story pre-release Event

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24న విడుదల కానుంది. బేబీ, కలర్ ఫోటో టీమ్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

నేడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను చెన్నైలో గడిపిన రోజులు గుర్తుచేసుకున్నారు. 'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నేనొక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాను. చెన్నైతో లవ్ స్టోరీ రోజులు గుర్తొచ్చాయి. చెన్నైతో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఇక్కడ కదా మన బతుకు తెరువు, ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఈ స్టూడియోల్లోనే కదా మనం నటుడిగా నిలదొక్కుకోవాలి.. ఇక్కడే కదా మనం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అంటూ అప్పట్లో నేను చెన్నై రోడ్ల మీద తిరిగాను. అక్కడే కార్లలో తిరిగాను. అనంతరం అక్కడే స్టార్ స్టేటస్ అందుకున్న చెన్నై రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే ఈ సినిమా టైటిల్‌ వినగానే నాకు చెన్నైతో లవ్ స్టోరీ గుర్తుకొచ్చింది ఈ టైటిల్‌లో ఆ మ్యాజిక్ ఉంది'' అని చిరంజీవి అన్నారు. 

అభిమానులను తాను ఎంతో ఇష్టపడతానని, కానీ అదే అభిమానులు పైకొస్తే తన ప్రాణప్రదంగా చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. నా అభిమానుల వల్లే ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఎస్‌కెఎన్‌, సాయి రాజేష్, దర్శకుడు రవి, నా అభిమానులు. కిరణ్ అబ్బవరం వాళ్ల అన్న నా అభిమాని, కిరణ్ పవన్ కళ్యాణ్ అభిమాని. వీళ్లందరి అభిమానం నన్ను ఇక్కడికి రప్పించింది. అభిమానులు కేవలం అభిమానమే కాకుండా తమను ప్రేరణగా తీసుకొని పైకి రావాలి. ఎస్‌కెఎన్‌, సాయి రాజేష్ లాంటి వారు ఏమి లేకుండా వచ్చి ఎదిగారు. కష్టాలు, అవమానాలు ఉన్నా కష్టపడితే విజయం సాధించవచ్చు. ఈ వేదికపై ఉన్న వీళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అసాధారణ కలలు కన్నారు. అదే వీళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు కూడా కలలు కనండి.. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి... తప్పకుండా విజయం సాధిస్తారు.. అందుకు నేనే ఉదాహరణ. కంఫర్ట్‌ జోన్‌ వదిలేయాలి.. కష్టానికి ఎదురెళ్లాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయండి. 

అప్పట్టో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి మహానటుల మధ్య నేను ప్రత్యేకంగా కనిపించాలని చాలా కష్టపడ్డాను. అలాగే కిరణ్ అబ్బవరం కూడా రాయచోటిలో పుట్టి, తిరుపతిలో సినిమాలు చూసి పెరిగి, ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు. అలాంటి కొత్తవాళ్లు ఇంకా ఇండస్ట్రీకి రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి మాట్లాడుతూ.. నేను డ్యాన్సులు అంత బాగా చేశానంటే మణిశర్మ సంగీతం వల్లే. ఆయన లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోతే నేను లేను. చివరగా చిరంజీవి సినిమా యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.  

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జోడీగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్‌ స్టోరీ’. దర్శకుడు సాయి రాజేశ్‌ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్స్‌పై సాయి రాజేశ్, ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement