కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమారు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే అంతా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓ యువతితో పాటు హీరో కూడా వ్యవస్థంపై పోరాటం చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నువ్వు పోలీసులను చంపుతావా? అదేమో డాక్టర్లను చంపుతోంది అంటూ చెప్పే డైలాగ్ వింటే కథంటో అర్థమవుతోంది. డీసీ అంటే డాక్టర్స్ అండ్ కాప్స్ అనే ఉద్దేశంతో టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. విజువల్స్‌తో పాటు, అనిరుధ్ బీజీఎంతో ట్రైలర్‌తోనే మరింత హైప్ తీసుకొచ్చింది.


