ఓటీటీల్లో అశ్లీల కంటెంట్.. ఏకంగా 50 ఫ్లాట్‌ఫా‍మ్స్..! | Government blocks 50 OTT platforms in 2 years over obscene content | Sakshi
Sakshi News home page

OTT platforms: ఓటీటీల్లో అశ్లీల కంటెంట్.. ఏకంగా 50 ఫ్లాట్‌ఫా‍మ్స్..!

Jul 22 2026 8:18 PM | Updated on Jul 22 2026 8:31 PM

Government blocks 50 OTT platforms in 2 years over obscene content

ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను రద్దు చేసింది. ఆ ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శించడం, 1986 వంటి పలు చట్టాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. సదరు ఓటీటీలు అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. డిజిటల్ న్యూస్‌, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చే ఫిర్యాదులను ఐటీ రూల్స్- 2021 కింద పరిష్కరిస్తారని డాక్టర్ మురుగన్ తెలిపారు. ఓటీటీల్లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించమని మధ్యవర్తులను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి  పేర్కొన్నారు. ఓటీటీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా.. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement