breaking news
Wamiqa Gabbi
-
వామికా విశ్వరూపం.. మృణాల్ చీర కడితే
గ్లామర్ విశ్వరూపం చూపించిన వామికా గబ్బిచీరకట్టులో మెరిసిపోతున్న మృణాల్ ఠాకుర్బీచ్ సైడ్ బికినీలో అదరగొట్టేసిన ప్రగ్యా జైస్వాల్చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఇవానాసముద్రంలో సర్ఫింగ్ బల్లపై ప్రియా వారియర్వైట్ డ్రస్‌లో ఏంజెల్లా కేతిక శర్మ(ఇదీ చదవండి: రాత్రయితే ఆ విషయాలు మాట్లాడొద్దని నా భార్యకు చెప్పా:తమిళ హీరో) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
'డిసి' సూపర్ హిట్.. బ్యూటీకి బంపర్ ఆఫర్
రీసెంట్ టైంలో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా అంటే చాలామంది 'డిసి' అని చెబుతారు. తెలుగులో అయితే జీరో ప్రమోషన్స్ చేశారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇందులో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి దక్షిణాదిలో ఓవర్‌నైట్ స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడదే ఊహించని అవకాశం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్ సినిమాలతో చాన్నాళ్ల తర్వాత వరస హిట్స్ అందుకున్న సూర్య ప్రస్తుతం నజ్రియాతో కలిసి మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌తో ఓ మూవీ చేస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ జ్ఞాన వేల్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఇకపోతే సూర్య 49వ చిత్రం 'జన నాయగన్' ఫేమ్ దర్శకుడు హెచ్.వినోద్ తీయనున్నాడట.ఈ మూవీలోనే హీరోయిన్గా లేటెస్ట్ సెన్సేషన్ వామిక గబ్బిని అనుకుంటున్నారట. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు సూర్య 'కరుప్పు'కు సాయినే సంగీతమందించాడు. దీని అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది. -
అవకాశం వస్తే వదులుకోను!
ప్రతి అడుగులోనూ ఓ కొత్త పాత్ర... ప్రతి మలుపులోనూ ఓ కొత్త అనుభవం! నటిగా తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ, విభిన్న పాత్రలతో అలరిస్తోంది నటి వామికా గబ్బి. అనుకోకుండా మొదలైన ఆ ప్రయాణంలోని ఎదురైన మలుపుల గురించి ఆమె మాటల్లోనే మీకోసం!తెలియకుండా వచ్చా! చిన్నప్పుడే కథక్ నేర్చుకున్నాను. నా ఎక్స్ప్రెషన్స్ నచ్చి, అడగకుండానే ‘జబ్ వి మెట్’లో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. అలా సినిమా అంటే ఏంటో కూడా తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. సినిమానే వదిలేద్దామనుకున్నా!ఒకానొక దశలో సినిమాలే వద్దనుకున్నాను. నేను ఎటు వెళ్తున్నానో అర్థంకాక నిరాశపడ్డాను. కానీ వచ్చిన కొన్ని మంచి అవకాశాలు మళ్లీ నాలోని నటిని నమ్మేలా చేశాయి. ఇప్పుడు హిందీ, పంజాబీ, మలయాళం, తమిళం, తెలుగు... ఇలా విభిన్న భాషల్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.మరో కొత్త అడుగు!‘డీసీ’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. కొత్త కథ, కొత్త ప్రపంచం... నటిగా నన్ను నేను మరోసారి పరీక్షించుకునే అవకాశం వచ్చింది. అదే సమయంలో ‘గూఢచారి 2’తో కూడా త్వరలోనే వస్తున్నాను. యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో నటించడం నాకు కొత్త అనుభూతి. ప్రేక్షకులు నన్ను మరో కొత్త కోణంలో చూడబోతున్నారనే ఆలోచనే చాలా ఎగై్జటింగ్‌గా ఉంది.ఐదుగురు పిల్లలు నాకుజంతువులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కుక్కలంటే చెప్పలేనంత ప్రేమ. నాకు ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. వాళ్లంతా నా పిల్లలే. షూటింగ్ కోసం దూరం వెళ్లినప్పుడు వాళ్లను మిస్ అవుతుంటాను. అంతేకాదు, నేను పూర్తిగా వీగన్ జీవనశైలిని పాటిస్తాను. దానికి ప్రధాన కారణం జంతువులపై నాకున్న ప్రేమే.అదొక క్రేజీ కలెక్షన్ !నేను ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి ఏదో ఒక ప్రత్యేకమైన ఉంగరం తీసుకురావడం అలవాటు. చిన్నదైనా సరే, ఆ ప్రదేశాన్ని గుర్తు చేసేలా ఉండాలి. అందుకే నా దగ్గర చాలా రకాల ఉంగరాలు ఉన్నాయి. ఒక్కో ఉంగరం వెనుక ఒక్కో ప్రయాణం ఉంటుంది.‘దేవదాస్’లో పారుగా కనిపించాలి!నా డ్రీమ్ రోల్ ఏంటని అడిగితే.. ‘దేవదాస్’లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ పోషించిన పారు పాత్ర నాకు చాలా ఇష్టం. అదే పాత్రను ఒక కొత్త కోణంలో చేసే అవకాశం వస్తే వదులుకోను. ఆ పాత్రలో చాలా బలమైన భావోద్వేగాలు ఉన్నాయి.ప్రశాంతత ఒక కళ!సినిమాల్లోకి వచ్చాక అందరూ మనల్ని ఎలా చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తే మన ప్రశాంతత పోతుంది. అందుకే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటాను. ఇతరుల అభిప్రాయాల కంటే... మన గురించి మనకు ఉన్న స్పష్టతే ముఖ్యమని ఇక్కడి నుంచి చాలా నేర్చుకున్నాను.కెమెరా చూసి భయపడేదాన్ని!మోడలింగ్ మొదట్లో కెమెరా కనిపిస్తే కాస్త ఇబ్బందిగా అనిపించేది. ఫ్రీజ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే కెమెరా ముందు ఇప్పుడు ఇన్ని పాత్రలు చేయడం చూస్తే నాకే నవ్వొస్తుంది!పేరు మార్చలేదు‘గబ్బి’ అనేది మా నాన్న పెట్టుకున్న కలం పేరు. ఆయన రచయిత. అదే పేరు ఇప్పుడు, నా స్క్రీన్ నేమ్‌గా వచ్చింది. నా పేరులో నాన్న సృజనాత్మక ప్రపంచం ఒక భాగంగా ఉండటం గర్వంగా ఉంటుంది. -
'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్
రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయిన సినిమా 'డిసి'. డైరెక్టర్ లోకేశ్ కనగరాజు హీరోగా నటించిన చిత్రమిది. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి అద్భుతాలు చేస్తోంది. తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తొలి వీకెండ్లోనే రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో నటించిన హీరోయిన్ వామికా గబ్బి కూడా తెగ ట్రెండ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: క్రేజీ న్యూస్.. 'డిసి' సీక్వెల్?)వామిక ఇప్పుడు ఓ మంచిపని చేసి నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. ఇందులో లోకేశ్ కనగరాజు, వామిక హీరోహీరోయిన్లుగా నటించగా.. వీళ్లతో పాటు పలువురు సహాయ పాత్రలు చేశారు. వాళ్లలో జవహర్ శక్తి అనే నటుడు ఒకడు. షూటింగ్ సందర్భంగా వామికతో ఇతడికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె తనకు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మొబైల్ గిఫ్ట్ ఇచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.వామిక విషయానికొస్తే..2007 నుంచి ఇండస్ట్రీలో ఉంది. 2015లో వచ్చిన 'భలే మంచిరోజు' సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే ఇన్నేళ్లయినా ఓ మాదిరి గుర్తింపు మాత్రమే ఉంది. ఇప్పుడు 'డిసి' హిట్‌తో ఈమెకు బాగానే కలిసొచ్చేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అడివి శేష్ 'గూఢచారి 2'లో హీరోయిన్గా చేస్తోంది. రిషభ్ శెట్టి 'జై హనుమాన్'లోనూ ఈమెని కీలక పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇవి గనక నిజమై సక్సెస్ అందుకుంటే ఈ బ్యూటీకి సౌత్‌లో మరిన్ని ఆఫర్స్ రావడం గ్యారంటీ.(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) -
క్రేజీ న్యూస్.. 'డిసి' సీక్వెల్?
స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తొలిసారి హీరోగా చేసిన సినిమా 'డిసి'. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామిక గబ్బి హీరోయిన్. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. తొలి వీకెండ్ అయ్యేసరికి రూ.50 కోట్ల సొంతం చేసుకుంది. ఇదే అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)దీంతో 'డిసి'కి సీక్వెల్ తీయాలనే ఆలోచన మొదలైందని అనుకుంటున్నారు. లోకేశ్ కనకరాజ్, దర్శకుడు అరుణ్ కాంబో రిపీట్ కానుందనే ప్రచారం జరుగుతుంది. దీనికి కూడా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. అయితే డిసి చిత్రం తరహాలో ఇది కూడా హింసాత్మక ఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందా ? లేక వేరే నేపథ్యంలో సాగే కథగా సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం లొకేశ్ కనకరాజ్.. అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి చేసిన తర్వాతే హీరోగా రెండో మూవీ చేస్తాడా? డైరెక్షన్ చేస్తూ నటన కూడా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) -
వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు)
-
లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఖైదీ, విక్రమ్, లియో, కూలీ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజు. ఆయన హీరోగా చేసిన తొలి సినిమా డీసీ(DC). అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ నేడు(ఆగస్ట్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. గ్యాంగ్‌స్టర్ సర్కార్ టీమ్‌లో కీలకంగా పని చేస్తే వ్యక్తి దేవదాస్ అలియాస్ దాసు(లోకేశ్ కనకరాజ్). పోలీసు ఆయుధాలు దొంగిలించడం వీళ్ల పని. అలా ఓ సారి పోలీసుల వాహనంపై దాడి చేసి ఆయుధాలు దొంగిలిస్తారు. అదే ప్రాంతంలో ఓ సామాన్య వ్యక్తి తన కొడుకు చదవుకు కోసం పొలం అమ్మి రూ. 7లక్షలు తీసుకెళ్తుంటాడు. ఈ డబ్బులను ఓ పోలీసు అధికారి తీసుకొని, అతన్ని దారుణంగా చంపేస్తాడు. దీంతో అతని భార్య దేవదాస్ బృందాన్ని ఆశ్రయిస్తుంది. విషయం తెలుసుకున్న దాసు.. ఆ పోలీసు అధికారిని హత్య చేస్తాడు. దీంతో బోగరాజు నేతృత్వంతోని ఓ ప్రత్యేక పోలీసు బృందం.. దాసు గ్యాంగ్ కోసం వెతుకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో దాసు..తన బృందంతో కలిసి విజయవాడలోని ఓ బార్లో తలదాచుకుంటారు. అక్కడ బార్ సింగర్ పార్వతిని (సంజనా కృష్ణమూర్తి) చూసి దేవదాస్ ప్రేమలో పడతాడు. అయితే పోలీసుల దాడితో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర(వామికా గబ్బి)కు విముక్తి కలిపిస్తాడు దేవదాస్. దీంతో ఆమె కూడా దాస్ వెంటనే వస్తుంది. వీరి జర్నీ ఎలా కొనసాగింది? అసలు చంద్ర ఎందుకు వేశ్యగా మారింది? దేవదాస్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? పేదవాడి కొడుకు చదువు కోసం దేవదాసు చేసిన పోరాటం ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా అసలు కథ. ఎలా ఉందంటే.. డీసీ.. కొత్త కథేమి కాదు. రొటీన్ గ్యాంగ్‌స్టర్ స్టోరీనే కానీ..అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథతోపాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించారు. ఇంత రా అండ్ రస్టిక్ కథలో కూడా భావోద్వేగాలను పెద్దపీట వేయడంతో ఓ డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ పేదవాడు తన కొడుకును గొప్పగా చదివించాలని ఆశ పడడం.. పోలీసు అధికారి అత్యాశతో పోయి అతన్ని చంపేయడం..ఇలా కథ ప్రారంభమే ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు, గ్యాంగ్‌స్టర్ మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్తాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దేవదాస్ గ్యాంగ్ విజయవాడకు వెళ్లడం..అక్కడ పార్వతి పరిచయంతో కథ మరో మలుపు తీరుగుతుంది. పార్వతి ఎపిసోడ్ మొత్తం హృదయాలకు హత్తుకునేలా సాగుతుంది. ఇక చంద్ర ఎంట్రీ.. ఆమె ప్లాష్‌బ్యాక్ మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది. రొటీన్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ అయినప్పటికీ.. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దాన్ని కొత్తగా మార్చేసింది. కొన్ని చోట్ల అనిరుధ్ ఇచ్చిన బీజీఎంకి థియేటర్ అంతా ఊగిపోతుంది. సెకండాఫ్‌లో కూడా కథనం పరుగులు పెడుతుంది. చంద్ర కూడా దాస్ టీమ్‌తో కలిసి ప్రయాణం చేయడం.. పోలీసులు వీరి కోసం వెతకడం..తప్పించుకునే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు.. అన్నీ అదిరిపోతాయి. డబ్బుల కోసం చంద్ర వేసిన ప్లాన్ థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగినా.. అనిరుధ్ బీజీఎంతో బోర్ కొట్టకుండా చేశాడు. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. అయితే లోకేశ్ మినహా మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులను అంతగా తెలియకపోవడంతో ఆ పాత్రలతో పెద్దగా కనెక్ట్ కాలేకపోతాం. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ కూడా పెద్ద ఉండవు. కథ మొత్తం ఒకే లైన్ మీద సాగుతుంది. అలాగే మితిమీరిన హింస కూడా ఓ వర్గం ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఇనాళ్లు తెర వెనుక ఉన్న లోకేశ్.. తొలిసారి తెరపై కనిపించి, ఆకట్టుకున్నాడు. దేవదాస్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. పెద్ద పెద్ద డైలాగులు లేకుండా కేవలం తన కళ్ళతో, హావభావాలతోనే చెప్పాల్సిన విషయం అర్థమయ్యేలా చెప్పేశాడు. వేశ్య చంద్ర పాత్రకి వామికా గబ్బి వందశాతం న్యాయం చేసింది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర అది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఇక సంజన.. తెరపై కనిపించేది కాసేపే అయినా..తనదైన నటనతో ఆకట్టుకుంది. పోలీసులు అధికారితో పాటు దాస్ గ్యాంగ్ మెంబర్స్ కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో రొటీన్ గ్యాంగ్‌స్టర్ కథను తెరపై డిఫరెంట్‌గా కనబడేలా చేశాడు. ఓ యాక్షన్ సీన్‌కి పెళ్లి బరాత్ బీజీఎం ఇవ్వడం హైలెట్. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరోగా లోకేశ్ కనగరాజ్.. డీసీ తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమారు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చూస్తుంటే అంతా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓ యువతితో పాటు హీరో కూడా వ్యవస్థంపై పోరాటం చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నువ్వు పోలీసులను చంపుతావా? అదేమో డాక్టర్లను చంపుతోంది అంటూ చెప్పే డైలాగ్ వింటే కథంటో అర్థమవుతోంది. డీసీ అంటే డాక్టర్స్ అండ్ కాప్స్ అనే ఉద్దేశంతో టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. విజువల్స్‌తో పాటు, అనిరుధ్ బీజీఎంతో ట్రైలర్‌తోనే మరింత హైప్ తీసుకొచ్చింది. -
హీరోగా స్టార్ డైరెక్టర్.. ట్రైలర్ రిలీజ్
ఖైదీ, విక్రమ్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ డీసీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాకు అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో చంద్ర (వామికా గబ్బీ) అనే యువతికి సపోర్ట్‌గా నిలిచే దేవదాస్‌గా లోకేశ్ కనగరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
'పతి పత్నీ ఔర్ వో దో' మూవీ ప్రమోషన్ (ఫొటోలు)


