మరో ఓటీటీలోకి హిట్ సినిమా 'డిసి' | DC Movie In Another OTT Latest Update | Sakshi
Sakshi News home page

DC Movie OTT: దాస్-చంద్ర 'డిసి'.. ఇప్పుడు మరో ఓటీటీలో

Oct 9 2026 11:18 AM | Updated on Oct 9 2026 11:23 AM

DC Movie In Another OTT Latest Update

విక్రమ్, లియో, ఖైదీ తదితర సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. తొలిసారి హీరోగా చేసి అద్బుతమైన హిట్ కొట్టాడు. ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఆ మూవీనే 'డిసి'. తెలుగు, తమిళంలో రిలీజై సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో దానిలోనూ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా 'డిసి'. ఆగస్టు 07న తెలుగు, తమిళంలో థియేటర్లలోకి వచ్చింది. ఏ మాత్రం అంచనాల్లేనప్పటికీ అద్భుతమైన హిట్ అయింది. కథ సాధారణంగానే ఉన్నప్పటికీ అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీ సక్సెస్‌లో కీలకమైంది. ఈ మూవీ ఇప్పటికే సన్ నెక్స్ట్ ఓటీటీలో గత నెలలో దక్షిణాది భాషల్లో రాగా ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వచ్చే శుక్రవారం(అక్టోబర్ 16) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

'డిసి' విషయానికొస్తే.. ఆయుధాలతో వెళ్తున్న ప్రభుత్వ వాహనాన్ని అడ్డగించి దేవదాస్‌ (లోకేశ్‌ కనగరాజ్‌) అండ్‌ గ్యాంగ్‌, వాటిని దోచుకుంటుంది. ఆ తుపాకులతోనే ఓ ఎస్సైని కాల్చి చంపుతుంది. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తారు. ఈ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేస్తారు. దీంతో దేవదాస్‌ గ్యాంగ్‌ తప్పించుకుని తిరుగుతూ ఓ లాడ్జిలో తలదాచుకుంటుంది. అక్కడి బార్‌లో పాటలు పాడే అమ్మాయి పార్వతి (సంజనా కృష్ణమూర్తి)తో దేవదాస్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. సరిగ్గా అప్పుడే పోలీసులు బార్‌పై దాడి చేసి కాల్పులు జరుపుతారు. ఈ కాల్పుల్లో పార్వతికి బులెట్‌ తగిలి చనిపోతుంది.

ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకున్న దేవదాస్‌.. తన ఆచూకీ చెప్పిన వారిని హత్య చేసేందుకు ఓ లాడ్జికి వెళ్తాడు. అక్కడి వేశ్యవాటికలో చిక్కుకుపోయిన చంద్రిక (వామికా గబ్బి)ని కలుస్తాడు. అసలు దేవదాస్‌.. గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి కారణమేంటి? చంద్రిక అలియాస్ చంద్రని కలిసిన తర్వాత అతడి ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో అతడు ఎవరెవరిని కోల్పోయాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement