సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా, అనుకోని పరిస్థితుల్లో మరొకరు చేయడం పరిపాటే. తెలుగులో ఇలా స్టార్ హీరోలు మిస్ అయిన చిత్రాలు చాలానే ఉంటాయి. ఇలా తమిళంలోనూ ఓ సూపర్ హిట్ మూవీ.. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి నుంచి మిస్ అయింది. అదే 'ఖైదీ'. తానే ఈ సినిమాలో తొలుత హీరో అని, కానీ తర్వాత ఎలా ఇది చేతుల మారిందనే విషయాన్ని సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
'ఖైదీ సినిమా ముందు నా దగ్గరకే వచ్చింది. ఆ ప్రాజెక్ట్ గురించి చర్చలు కూడా జరిగాయి. కానీ ఫైనల్ అవ్వలేదు. కార్తి ఆ సినిమా చేయాలనుకున్నారు. ఆయన నాకు ఫోన్ చేసి.. ‘యోవ్ వీఎస్, నేను చేస్తానయ్యా’ అన్నారు. అందుకు నేను ‘చాలా బాగా చేయండి సర్’ అని చెప్పాను. దాని గురించి నాకు ఎలాంటి బాధా లేదు. లోకేశ్ కనకరాజ్ నాకు బాగా తెలుసు. నాకు బ్రదర్ లాంటివాడు. కార్తి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. కథ విన్నప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని అర్థమైంది. తమిళం, తెలుగులో ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని కూడా వాళ్లతో చెప్పాను. ఇది అద్భుతమైన సినిమా, మంచి సినిమా. కానీ ఓ మంచి మూవీ కోల్పోయానని నేను బాధ పడడం లేదు' అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు.
కార్తి కెరీర్ టర్న్ చేయడంతో పాటు లోకేశ్ కనగరాజ్‌కి తెలుగులో చాలా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనేది మూలం కూడా ఈ చిత్రమే. అయితే మూవీ చూసిన తర్వాత ఈ పాత్రలో కార్తి తప్పితే మరెవరూ సెట్ అవ్వరేమో అనిపించింది. కానీ ఇప్పుడు సేతుపతి అసలు సంగతి చెప్పిన తర్వాత ఇతడు చేసినా బాగానే ఉండేదేమో అనిపించింది. కాకపోతే కార్తికి ఉన్న మార్కెట్ కారణంగా ఇది మరింత మందికి చేరువైంది అనడంలో సందేహం లేదు.
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఖైదీ తర్వాత విక్రమ్ వచ్చింది. అయితే ఖైదీకి సీక్వెల్ తీస్తానని లోకేశ్ ఎప్పటినుంచో చెబుతున్నాడు గానీ అదెప్పటికి జరుగుతుందో తెలియట్లేదు. అసలు ఉంటుందా లేదా అని ఈ యూనివర్స్ అభిమానులు కూడా లైట్ తీసుకుంటున్నారు.
#Kaithi came to me, and we were in talks about the project, but it didn’t get fixed. #Karthi sir wanted to do it. He called me and said, “Yov VS, naan panran ya.” I said, “Super-ah pannunga, sir.” I don’t have any worries. I’ve known #LokeshKanagaraj well; he’s like my brother. I have great respect for #Karthi. I knew the movie would be successful after the narration. I told them the movie would run great in Tamil and Telugu. It’s a superb film and a good film. I don’t think I’ve missed another good film like that. - #VijaySethupathi https://t.co/4w0Cl4kUAv
— Movies Singapore (@MoviesSingapore) November 26, 2026


